టీమిండియాలో మరో ముసలం! రోహిత్, హార్దిక్ పాండ్య మధ్య పెరిగిన దూరం!

Hardik Pandya Rohith Sharma

ఇండియన్ క్రికెట్ బ్రాండ్ వ్యాల్యూ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంత క్రేజ్ ఉన్నప్పుడు ఆటగాళ్లకి కూడా స్టార్ డం రావడం మాములు విషయమే. అయితే.. ఇప్పుడు ఇదే ఇండియన్ క్రికెట్ కి శాపం అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీమ్ లో ఎక్కువ మంది స్టార్స్ ఉండటం వల్ల చిన్న చిన్న కారణాలకే వీరి మధ్య దూరం పెరిగిపోతుంది. తాజాగా.. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య కూడా ఇలాంటి గొడవ ఏమైనా జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

కోహ్లీ రిటైర్మెంట్ తరువాత రోహిత్ శర్మ టీ 20 జట్టుకి కెప్టెన్ గా ఎన్నిక అయ్యాడు. రోహిత్ కెప్టెన్ కాగానే టీమ్ లో హార్దిక్ పాండ్యకి స్థానం లేకుండా పోయింది. ఇదే సమయంలో హార్దిక్ స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్ తో భర్తీ చేపించడానికి చకచకా ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు బయటకి వచ్చాయి. దీంతో.. టీమ్ లో తన స్థానాన్ని ప్రశ్నార్ధకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హార్దిక్ హార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆటగాళ్లు ఇద్దరు ఇన్ స్టాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకి బలం చేకూరింది.

నిజానికి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య ఇద్దరూ కూడా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రోహిత్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాకనే హార్దిక్ కి మంచి అవకాశాలు లభించాయి. ఆ సమయంలోనే రోహిత్ శర్మ హార్దిక్ ని బాగా ఎంకరేజ్ చేశాడు. కానీ.., తన సత్తా ఏమిటో పూర్తిగా తెలిసిన రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక.. టీమ్ లో తన ప్లేస్ గల్లంతు అవ్వడం హార్దిక్ ని బాదిచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు.. హార్దిక్ ఇప్పుడు బౌలింగ్ చేయడం లేదు. దీంతో.. అతన్ని ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటయిందో, లేదో అన్నది కూడా డౌట్ గా మారింది. ఇక్కడ కూడా హార్దిక్ కి రోహిత్ నుండి అంతగా మద్దతు లభించడం లేదట! ఈ కారణాల వల్లే ఇద్దరు ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి. ఈ విషయంలో తప్పు ఎవరిది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.