ABD రిటైర్మెంట్ తో మారిన RCB లెక్కలు

Rcb Kohli Ipl

సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌ తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మొత్తం క్రికెట్ ఆట నుంచే తప్పుకోనున్నట్లు ప్రకటించటంతో అతని ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. ఇక మరో విషయం ఏంటంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ లో కీలక ఆటగాడిగా ఉన్న ఏబీ డివిలియర్స్‌ రిటైర్ మెంట్ తో ఐపీఎల్ 2022 మెగా యాక్షన్ ఆ టీమ్ రిటెన్షన్‌ లో లెక్కలు మారబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలో ఐపీఎల్ 2022 మెగా యాక్షన్ లో భాగంగా ముందు ఇద్దరు విదేశీ ఆటగాళ్లు.. ఇద్దరు స్వదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని RCB భావించింది. కానీ అనుకున్న రీతిలో పరిస్థితులు ఉండకపోవటంతో లెక్కలు తారుమారవ్వటంతో RCB కొత్త ప్రణాళికకు కాలు కదుపుతోంది. వచ్చే నెలలో ఐపీఎల్ 2022 మెగా యాక్షన్ జరిగే అవకాశం ఉండడంతో ఈ వేలంలో భాగంగా ముగ్గురు భారత ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, చాహల్, మహ్మద్ సిరాజ్ లతో పాటు ఒక విదేశి ఆటగాడి ఏబీ డివిలియర్స్‌ స్థానంలో మ్యాక్స్ వెల్ ను RCB రిటర్న్ చేసుకోబోతుందని తెలుస్తోంది.