ప్రపంచంలోనే ఎత్తైన భవనంపై టీమిండియా జెర్సీ.. వీడియో వైరల్

Burj Khalifa

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ ఫీవర్‌ స్టార్ట్‌ అయిపోయింది. బీసీసీఐ తుది జట్టును ప్రకటించడంతో అందరూ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. జట్టులో శార్దూల్‌ ఎంట్రోతో ఆ జోష్‌ ఇంకాస్త పెరిగింది. అక్టోబర్‌ 18న దుబాయ్‌ వేదికగా టీమిండియా.. ఇంగ్లాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అక్టోబర్‌ 20న దుబాయ్‌ మైదానంలోని తన ఫైనల్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఆస్ట్రేలియాపై ఆడనుంది. సమయం దగ్గర పడటంతో బీసీసీఐ చకాచకా పనులు పూర్తి చేస్తోంది. తుది జట్టును ప్రకటించడమే కాదు.. టీ20 వరల్డ్‌కప్‌నకు టీమిండియా జెర్సీని కూడా విడుదల చేసింది. బిలియన్‌ ఛీర్స్‌ జెర్సీ అంటూ విడుదలైన జెర్సీ అందరినీ ఆకట్టుకుంటోంది. టీమిండియా జెర్సీని బుర్జ్‌ ఖలీఫాపై అఫీషియల్‌గా లాంఛ్‌ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీమిండియా వరల్డ్‌కప్‌ జెర్సీ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.