ఇండస్ట్రీలోకి రావాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సిన పనిలేదు. మనలో టాలెంట్ ఉంటే చాలు అని చిరంజీవి, రవితేజ లాంటి హీరోలు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీళ్ళు వేసిన బాటలో చాలామంది యువ నటీనటులు హీరోలుగా నిలదొక్కుకునేందుకు కష్టపడతున్నారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకడు. ఇప్పటికే ఐదు సినిమాలతో తను ఏంటో కొంతలో కొంత నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. కొన్ని హిట్స్.. మరికొన్ని ప్లాఫ్స్ అందుకున్నాడు. ఇప్పుడు ‘ వినరో భాగ్యము విష్ణు కథ ‘తో ప్రేక్షకుల్ని అలరించేందుకు థియేటర్స్ లోకి వచ్చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటి? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
విష్ణు (కిరణ్ అబ్బవరం) చిన్నప్పుడే అమ్మానాన్న ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. దీంతో తాత శ్రీనివాసులు (శుభలేఖ సుధాకర్) అతడిని పెంచి పెద్ద చేస్తారు. అలా విష్ణు లైబ్రేరియన్ అవుతాడు. తొలుత తిరుపతిలోని యూనివర్సిటీలో జాబ్ చేసేవాడు హైదరాబాద్ కి ట్రాన్స్ ఫర్ అవుతాడు. నైబర్ ఫోన్ నంబర్ వల్ల రాజన్ అని ఓ గ్యాంగ్ స్టర్ ని కలుస్తాడు. కొన్ని పరిస్థితుల వల్ల తన కథ అంతా చెప్తాడు. అలా తన లైఫ్ లోకి వచ్చిన దర్శన(కశ్మీర), శర్మ(మురళీ శర్మ) గురించి కూడా చెప్తాడు. వాళ్లిద్దరి వల్ల తమ లైఫ్ లో ఏమేం జరిగాయో పూసగుచ్చినట్టు రాజన్ కి చెప్తాడు. మరి విష్ణు చివరకు ఏం చేశాడు. రాజన్ చివరకు ఏమయ్యాడు అనేది తెలియాలంటే మీరు ‘ వినరో భాగ్యము విష్ణు కథ ‘ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే.
ఒక్క మాటలో చెప్పాలంటే.. హీరో విష్ణు.. ఓ గ్యాంగ్స్టార్ కి చెప్పే తన లైఫ్ స్టోరీనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ట్రైలర్ లో నైబర్ ఫోన్ నంబర్ అనే కాన్సెప్ట్ చూసి ఇదేదో ఎంటర్ టైన్మెంట్ సినిమా అనుకుంటే మీరు పొరబడినట్లే. ఫస్ట్ ఫస్ట్ వేరే ఊరు వాళ్ళు ఇంటికొచ్చిమరి తిట్టారని ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో మనవడు విష్ణుకి ఎప్పుడు సహాయం మాత్రమే చేయమని అతడి తాత చెప్తాడు.దాన్ని తుచా తప్పకుండా మనోడు పాటిస్తాడు. ఎంతలా అంటే.. రోడ్ సైడ్ ఎవడో పస్ పోస్తుంటే వాడికి చేతులు కడుక్కోడానికి మినరల్ వాటర్ ఇచ్చేంత మంచోడు. అలా ఒకరోజు నైబర్ నంబర్ అంటూ.. యూట్యూబర్ దర్శన పరిచయం. ఆమె ద్వారానే శర్మ కూడా పరిచయం అవుతాడు. వేల ముగ్గురు చేసే ఎంటర్ టైన్ మెంట్ ఫస్ట్ హాఫ్ అంతా వుంటుంది. ఈ మొత్తంలో మురళీశర్మ ది చిన్న కామెడీ బిట్ వుంటుంది. అది తప్పితే చాలా బోరింగ్ గా వెళ్తూ వుంటుంది సినిమా. సరిగ్గా ఇంటర్వెల్ టైం కి హీరో హీరోయిన్ మురళీ శర్మ మధ్య అదిరిపోయే ట్విస్ట్ పడ్తుంది.
సరే ఇంటర్వల్ ట్విస్ట్ ఏదో కాస్త పర్లేదు. సెకండ్ హాఫ్ లో అయినా ఏదైనా ఇంటరెస్ట్ వుంటుంది అనుకుంటే అక్కడ కూడా డ్రామా ఎక్కువైపోయింది. చివరకు ఏదో మామ అనిపించేలా క్లైమాక్స్ ని ఎండ్ చేశారు. సీక్వెల్ కూడా ఉంటుంది అనే హింట్ తో సినిమాని ఎండ్ చేశారు. అయితే ఈ సినిమాని డైరెక్టర్ ఈ జొనర్ అనుకుని తీశారు అనేది ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఓ వైపు ఎంటర్ టైన్ మెంట్ ఉంటూనే మరో వైపు చాలా క్వశ్చన్స్ నీ.. డైరెక్టర్, ఆడియన్స్ కి వదిలేశాడు. పోనీ వాటికి సెకండ్ హాఫ్ లో కన్విన్సింగ్ గా చెప్పాడా అంటే అదీ లేదు. మూవీలో దాదాపు చాలా సేపు బోరింగ్ సీన్స్ ఉంటాయి. కొన్నిసార్లు స్టోరీలో ఏం జరుగుతుందో అర్థం కాదు! ఎంచుకున్న కథ థ్రిల్లర్ అయినప్పుడు దాన్ని అంతే థ్రిల్లింగ్ గా చెప్పాలి. మధ్యలో ఎక్ట్రా సీన్స్ ఏం పెట్టకూడదు. ఒకవేళ అలా వుంటే సినిమా చూసే ప్రేక్షకుడు డైవర్ట్ అయిపోతాడు. ‘ వినరో భాగ్యము విష్ణు కథ ‘ విషయంలో అదే జరిగింది అనిపిస్తుంది. పేరుకు తగ్గట్టు భక్తి ఏమైనా వుందా అంటే తిరుపతి లొకేషన్స్, పాత్రలకు ఆ ప్రాంతానికి సూట్ అయ్యే పేర్లు మాత్రమే ఉంటాయి. ఇక చివర్లో సీక్వెల్ వుంటుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు ట్రెండ్ కథ అని ఇచ్చినట్టు ఉన్నారు. వుంటుందా లేదా అనేది చూడాలి.
ఇందులో యాక్టింగ్ విషయానికి వస్తే హీరో కిరణ్ అబ్బవరం, మురళీ శర్మ గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్లకు యాక్టింగ్ చేసేంత స్కోప్ లేదు. కొద్దిలో కొద్దిగా హీరోయిన్ బెటర్. శుభలేఖ సుధాకర్, దేవి ప్రసాద్, అమని లాంటి అద్భుతమైన నటులు ఉన్నారు. కానీ డైరెక్టర్ వాళ్ళని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. కమెడియన్ ప్రవీణ్ కూడా వున్నాడు అంటే వున్నాడు అంతే. ఇక టెక్నికల్ టీమ్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి.. తన వరకు పూర్తి న్యాయం చేశాడు. ఉన్నంతలో విజువల్స్ నీ బాగా చూపించాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్, ఫైట్ సీన్స్ లో బాగా ఇచ్చాడు. పాటలు ఓకె. థియేటర్ బయటకు వచ్చాక గుర్తుండవు. డైరెక్టర్ మురళీ కృష్ణ అబ్బురు స్టోరీ బాగానే అనుకున్న దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో చాలా తడబడ్డాడు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, నిడివి విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకుని వుండాల్సింది. ఓవరాల్ గా చెప్పుకుంటే.. విష్ణు కథ చాలా బోరింగ్!
చివరగా: విష్ణు కథ.. విసిగించే కథ!
రేటింగ్: 1.5 / 5