Rama Rao On Duty Telugu Movie Review: టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ ఉన్న హీరోలలో రవితేజ ఒకరు. ప్రేక్షకుల చేత మాస్ మహారాజ్ అనిపించుకున్న రవితేజ.. తనకంటూ ప్రత్యేక మాస్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. తాజాగా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫస్ట్ టైమ్ రవితేజ నుండి మాస్ అంశాలు లేకుండా రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కించాడు. ఇక వేణు తొట్టెంపూడి కంబ్యాక్ చేస్తుండగా.. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథ 1995లో మొదలవుతుంది. రాయలసీమలోని ఓ ప్రాంతానికి రామారావు(రవితేజ) ఒక సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. కొంతకాలనికి అక్కడినుండి చిత్తూరు సబ్ కలెక్టర్ గా బదిలీ అవుతాడు. ఆ ప్రాంతంలో చిన్ననాటి స్నేహితురాలు మాలిని(రజిషా విజయన్)ని కలుస్తాడు. అదే సమయంలో మిస్టరీ కేసులుగా మిగిలిపోయిన కొన్ని హత్యల గురించి తెలుసుకొని ఆ బాధ్యతలు తీసుకుంటాడు. అప్పటినుండి సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా.. కేసులో రామారావుకు దిమ్మతిరిగే నిజాలు తెలుస్తాయి. మరి కనిపించకుండా పోయినవారు ఏమయ్యారు? వారి హత్యల వెనుక రహస్యం ఏంటి? అసలు ఆ ఏరియాలో ఏం జరుగుతుంది? ఈ సీరియస్ క్రైమ్ లో రామారావు లైఫ్ ఎలా టర్న్ అయ్యింది? అనేది తెరపై చూడాల్సిందే.
మాస్ రాజా రవితేజ అంటే.. సినిమాలలో మినిమమ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్సపెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. కానీ.. ఈసారి రామారావు ఆన్ డ్యూటీ మూవీతో తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడు శరత్ మండవ డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్నాడు. అయితే.. చాలకాలం తర్వాత రవితేజ నుండి డిఫరెంట్ స్టోరీ లైన్, కొత్త ట్రైలర్ చూసేసరికి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను బాగా ప్రమోట్ చేసుకున్నారు. అయితే.. దర్శకుడు శరత్ ఈ సినిమాను థ్రిల్లర్ నుండి క్రైమ్ డ్రామాగా ప్లాన్ చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది.
రామారావు ఆన్ డ్యూటీ కంప్లీట్ సీరియస్ యాక్షన్ మూవీ. సినిమా ప్రారంభంలోనే ఇంటరెస్టింగ్ గా స్టార్ట్ చేశారు. సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్ రామారావు పాత్రలో రవితేజ ఎంట్రీ బాగుంది. అయితే.. హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొదలైన తర్వాత చాలాసేపటి వరకు కథలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో ట్రాన్స్ ఫర్ కారణంగా రామారావు తన భార్య నందినీ(దివ్యాంశ) ఫ్యామిలీతో కలిసి చిత్తూరుకు షిఫ్ట్ అవుతారు. అంటే ఇంటర్వెల్ ముందు నుండి అసలు కథ మొదలవుతుంది. అక్కడే రామారావు ఫస్ట్ లవ్ ఎదురుపడటం, మిస్టరీ కేసులు, శేషాచలం అడవుల్లో జరిగే అక్రమ దందాలు, స్మగ్లింగ్ అన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి.
ఇక ఓ ట్విస్టుతో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. కట్ చేస్తే సెకండాఫ్ లో కూపి లాగినాకొద్ది షాకింగ్ నిజాలు బయటపడుతుంటాయి. అయితే.. దర్శకుడు శరత్ మండవ సస్పెన్స్ థ్రిల్లర్ గా కంటే క్రైమ్ డ్రామాగా మలిచాడు. సినిమాలో అధిక భాగం ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో లాగించేశాడు. తమ వారు కనిపించకుండా పోవడంతో కొందరు పేదలు రామారావును ఆశ్రయించడం, వాళ్ల ఆచూకీ కోసం రామారావు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అన్న కోణంలో సినిమా ఎక్కువ భాగం సాగింది. అదిగాక సీరియస్ మోడ్ లో కూడా హీరోయిన్స్ తో సాంగ్స్ సినిమా సాగుతున్న విధానానికి ఇబ్బందిగా అనిపిస్తాయి. కాకపోతే హీరోయిన్స్ తో ఉన్న రెండు పాటలు పర్వాలేదు అనిపించాయి. అక్కడక్కడా రామారావును కాకుండా రవితేజను హైలైట్ చేసేందుకు ఏర్పాటు చేసిన ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఓవర్ గా అనిపిస్తాయి.
మరీ సెకండాఫ్ లో మార్కెట్ ఫైట్ బోయపాటి ఫైట్స్ ని తలపిస్తుంది. సినిమా అంతా స్లో నేరేషన్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆసక్తికరంగా లేవు. అలాగే సినిమా కూడా నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. హీరో రవితేజ రామారావుగా సీరియస్ మోడ్ లో ఆకట్టుకున్నాడు. సామ్ సిఎస్ సాంగ్స్ సినిమాకు పెద్దగా యూస్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు. సీరియస్ గా నడుస్తున్న స్టోరీ మధ్యలో సాంగ్స్ సింక్ కాలేదని అర్థమవుతుంది. స్టోరీ పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. దాన్ని తెరపై ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అవ్వలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవ్వలేదని ప్రేక్షకుల అభిప్రాయం. రవితేజ గత చిత్రాలకు భిన్నంగా సినిమాను ట్రై చేశారు. కానీ.. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో ఉండే మ్యాజిక్ రామారావులో పూర్తిగా లోపించింది.
హీరో వేణు తొట్టెంపూడి ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని ఇంటర్వ్యూలలో చెప్పారు. కానీ.. ఊహించిన స్థాయిలో ఆయన పాత్ర ఎస్టాబ్లిష్ కాలేదు. సినిమాలో ప్యూటీ కలెక్టర్ రామారావు కాస్త… పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మారిపోవడం కన్ఫ్యూషన్ కి గురిచేస్తుంది. ఎక్కడో మొదలైన కథ మంగళూరుకి వెళ్లి అక్కడ నుండి శేషాచలం రెడ్ శాండిల్ స్మగ్లింగ్ వద్ద ఆగడం.. మూవీని పికప్ చేయలేదు. స్క్రీన్ ప్లే వీక్ గా ఉండి ఎంగేజింగ్ గా లేకపోవడమే మేజర్ మైనస్. హీరోయిన్స్(దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్) గురించి చెప్పుకోవడానికి ఏమిలేదు. మిగతా వారంతా పర్వాలేదు అనిపించారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిమాట: అంచనాలు అందుకోలేకపోయిన రామారావు!
రేటింగ్: 2/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!