బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరైన హిట్ కొట్టి దాదాపు పదేళ్లు కావస్తోంది. చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత షారుఖ్ ఖాతాలో ఆ స్థాయి హిట్ పడలేదు. ఆ తరువాత చాలా సినిమాలు చేశాడు కానీ.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు షారుఖ్ సాలిడ్ హిట్ కొడతాడా? అని దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. జీరో మూవీ తర్వాత షారుఖ్ సోలో హీరోగా ‘పఠాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ లతో భారీ అంచనాలు సెట్ చేసింది. మరి పఠాన్ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకోనుందో రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథాంశం దేశభక్తితో కూడుకుంది. ఏజెంట్ జిమ్(జాన్ అబ్రహం), ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తుంటాడు. అప్పుడే భారత ప్రభుత్వం ఓ కీలక ఆర్టికల్ ని రద్దు చేయడంతో జిమ్ కి దారి క్లియర్ అవుతుంది. దీంతో కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవడం కోసం శత్రుదేశం పాకిస్తాన్ కి చెందిన సినిస్టర్ డిజైనర్స్ తో చేతులు కలిపి భారీ ట్యాంకర్ తో అటాక్ కి ప్లాన్ చేస్తాడు. కట్ చేస్తే.. జిమ్ అటాక్ గురించి తెలుసుకున్న ఇండియన్ గవర్నమెంట్.. అప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న స్పై సోల్జర్ పఠాన్(షారుఖ్)ని రంగంలోకి దించుతుంది. జిమ్ ని ఆపే ఈ ఆపరేషన్ లో పఠాన్ కి తోడుగా ఐఎస్ఐ ఏజెంట్ రుబీనా(దీపికా) పరిచయం అవుతుంది. మరి ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేసిన ఆ ఆర్టికల్ ఏంటి? జిమ్ అటాక్ ని పఠాన్ ఎలా ఎదుర్కొంటాడు? పఠాన్ కి రుబీనా ఎలా సహకరించింది? చివరికి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.
పఠాన్ మూవీ విషయానికి వస్తే.. షారుఖ్ ఫ్యాన్స్ అంతా దీనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ అన్నీ కూడా విజువల్స్ పరంగా విశేషంగా ఆకట్టుకున్నాయి. అదీగాక షారుఖ్ నుండి స్పై థ్రిల్లర్ మూవీ.. పైగా యాక్షన్ మూవీలలో దిట్ట అనిపించుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఈ కాంబినేషన్ కి తోడుగా దీపికా పదుకొనే, విలన్ గా జాన్ అబ్రహం.. ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేందుకు ఇంకేం కావాలి. ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలిమ్స్ గురించి తెలిసిందే. షారుఖ్ తో వారికి చాలా సినిమాల అనుబంధం ఉంది. అదీగాక పఠాన్ సాంగ్స్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో దుమారం రేపాయో చూశాం.
పఠాన్ మూవీకి మొదటి నుండి వివాదాల ద్వారానే బజ్ ఎక్కువగా క్రియేట్ అయ్యింది. వీడియో సాంగ్స్ లో దీపికా డ్రెస్సింగ్ స్టైల్ పై.. షారుఖ్ పై ట్రోల్స్ చేశారు. దేశవ్యాప్తంగా పఠాన్ ని బ్యాన్ చేయాలనే కామెంట్స్ కూడా వినిపించాయి. వీటన్నింటికీ.. కేవలం ట్రైలర్ లో ఒకే ఒక్క దేశభక్తి డైలాగ్ తో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఆ ఒక్క డైలాగ్ తోనే సినిమాపై పాన్ ఇండియా వైడ్ పాజిటివ్ వైబ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఫ్యాన్స్ అంచనాలను, పాజిటివ్ బజ్ ని క్యాష్ చేసుకుందా లేదా చూద్దాం. పఠాన్ మూవీ కేవలం స్పై థ్రిల్లర్ గా మాత్రమే కాకుండా దేశభక్తి పాయింట్ ని సాలిడ్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అదీగాక బాలీవుడ్ తరహా ట్రీట్ మెంట్, ఆ గ్లామర్ కూడా కంటిన్యూ చేశారు
ఈ సినిమా కథ.. దేశభక్తి పాయింట్ తో సాగినప్పటికీ, కథ పరంగా హాలీవుడ్ సాలిడ్ యాక్షన్ ఫిలింస్ నుండి ఇన్స్పైర్ అయినట్లు అనిపిస్తుంది. బట్.. ఇది చాలా డిఫరెంట్ మూవీ. సినిమా ఆరంభం నుండి చివరిదాకా ఓ సాలిడ్ యాక్షన్ ట్రీట్ తో పాటు బ్యాక్ ఎండ్ లో పేట్రియాటిక్ కోర్ ని వదలకుండా కంటిన్యూ చేశారు మేకర్స్. ఈ సినిమాని ముందుగా విలన్ జిమ్ క్యారెక్టర్ లో జాన్ అబ్రహం పరిచయం చేస్తూ మొదలైంది. దేశంపై అతని ప్రతీకారం, అటాక్ ప్లాన్ గురించి చూపిస్తూనే.. పఠాన్ ఎంట్రీ కోసం ఆసక్తి పెరిగేలా చేశారు. ట్రైలర్ చూస్తేనే సినిమాలో ఎలాంటి యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయో అర్థమవుతుంది. అలా ఓ మాసివ్ ఆక్షన్ సీక్వెన్స్ తో స్పై పఠాన్ క్యారెక్టర్ లో షారుఖ్ ఎంట్రీ సాలిడ్ గా డిజైన్ చేశారు.
డైరెక్టర్ సిద్ధార్థ్ మేకింగ్ గురించి తెలిసినవారు హీరోల ఇంట్రడక్షన్ లను ఎంత సాలిడ్ గా ప్లాన్ చేస్తాడో తెలుస్తుంది. బ్యాంగ్ బ్యాంగ్, వార్ మూవీస్ తర్వాత సిద్ధార్థ్ నుండి వచ్చిన సినిమా ఇది. కాబట్టి.. హృతిక్ రోషన్ నే ఆ స్థాయిలో ప్రెజెంట్ చేస్తే.. షారుఖ్ ని ఇంకెంత ప్రెజెంట్ చేయాలనే ఆలోచన బాగుంది. పఠాన్ ఎంట్రీ సీన్ తర్వాత.. ఆ క్యారెక్టర్ కి సెట్ చేసిన లక్ష్యాన్ని తెలియజేస్తూ.. పఠాన్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలిపేందుకు ‘పార్టీ పఠాన్ ఇంట్లో పెట్టుకుంటే.. పఠాన్ తప్పకుండా వస్తాడు. టపాసులు కూడా తెస్తాడు’ అనే డైలాగ్ తో పాటు ‘ఒక సోల్జర్ ఎప్పుడు దేశం తనకోసం ఏం చేసిందని ఆలోచించడు.. దేశం కోసం తనేం చేయగలనా అని ఆలోచిస్తాడు’ లాంటి డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
ఆ తర్వాత స్టోరీలోకి ఐఎస్ఐ ఏజెంట్ రుబీనా ఖాన్ క్యారెక్టర్ లో దీపికా పదుకొనే ఎంట్రీ.. పఠాన్ తో ఆమెకు పరిచయం.. లవ్ ట్రాక్.. ఆమె లక్ష్యం.. సాంగ్స్ తో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ మధ్య ఇంటర్వెల్ లో ఊహించని ట్విస్ట్ తో అదరగొట్టారు. ఫస్టాఫ్ లో క్యారెక్టర్స్ కి సాలిడ్ టార్గెట్స్ సెట్ చేసి.. సెకండాఫ్ లో అసలు కథను చూపించారు. అక్కడినుండి పఠాన్ క్యారెక్టర్ తో పాటు రుబీనా పోరాటం.. మరోవైపు విలన్ జిమ్ క్యారెక్టర్ లో జాన్ అబ్రహం మాస్టర్ ప్లాన్స్ అన్నీ.. విజువల్ ట్రీట్స్ తో సాగుతుంది. ఈ సినిమాలో ఇంతవరకు చూడని భారీ, హైలీ రిస్క్ ఫైట్స్, ఛేజింగ్ సీక్వెన్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. క్లైమాక్స్ లో పఠాన్ – జిమ్ ల మధ్య వార్ ఆడియెన్స్ కి హై ఫీలింగ్ కలిగిస్తాయి. చివరలో మైండ్ బ్లాక్ చేసే ఓ ట్విస్ట్ ఇందులో ఉంది. అది రివీల్ చేయట్లేదు.
ఇక సినిమా అంతా భారీ యాక్షన్.. బిగ్ ఫైట్స్.. అటాక్ ప్లాన్.. ఏజెంట్స్.. స్పైస్ లాంటి అంశాల చుట్టూ తిరుగుతుంది కాబట్టి.. సినిమాలో కామెడీ ఎక్కడా ఉండదు. పైగా కొన్నిచోట్ల యాక్షన్ సీన్స్ హాలీవుడ్ నుండి పూర్తిగా ఇన్స్పైర్ అయ్యారేమో అనిపిస్తుంది. కానీ.. షారుఖ్ ని ఆ యాక్షన్ సీన్స్ లో చూస్తే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. చాలాకాలంగా షారుఖ్ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో.. అలాంటి యాక్షన్ థ్రిల్లర్ నే అందించాడని చెప్పవచ్చు. పఠాన్ క్యారెక్టర్ లో షారుఖ్ విశ్వరూపం చూపించేశాడు. రుబీనా క్యారెక్టర్ లో దీపికా సీరియస్ గా కనిపిస్తూనే.. చాలా గ్లామరస్ గా అలరించింది. విలన్ గా జాన్ అబ్రహం యాక్షన్ బాగుంది. మిగతా యాక్టర్స్ అంతా వారి పాత్రలకు న్యాయం చేశారు. స్క్రీన్ ప్లే, యాక్షన్ బ్లాక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి మేజర్ ప్లస్ లు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఇది పక్కా సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్ ఫ్లిక్.
ఎక్కువగా హాలీవుడ్ ని పోలిన యాక్షన్ సీన్స్