మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలను థియేటర్స్ లో చూడకపోయినా ఓటిటిలో చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల దృశ్యం, మన్యం పులి, లూసిఫర్, దృశ్యం 2 లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న మోహన్ లాల్.. రీసెంట్ గా ‘మాన్స్టర్'(MONSTER) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో డిజిటల్ రిలీజైన ఈ సినిమాను ‘మన్యం పులి’ ఫేమ్ వైశాక్ తెరకెక్కించారు. తెలుగు యాక్టర్స్ మంచు లక్ష్మి, జగపతి బాబు కీలకపాత్రల్లో నటించిన ఈ ‘మాన్స్టర్’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథ లక్కీ సింగ్(మోహన్ లాల్) అనే ‘పంజాబీ మలయాళీ’ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. కొన్ని పర్సనల్ పనులతో పాటు బిజినెస్ పనిమీద కేరళకు వస్తాడు లక్కీ సింగ్ ని, ట్యాక్సీ డ్రైవర్ భామిని(హనీ రోజ్) తమ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం ఇంటికి ఆహ్వానిస్తుంది. అలా భామని ఫ్యామిలీకి పరిచయమైన లక్కీ సింగ్.. కేరళకు వచ్చింది బిజినెస్ పనిమీద కాదని.. తమకు తెలియకుండా వేరే ప్లాన్ తో వచ్చాడని భామిని ఫ్యామిలీ తెలుసుకుంటుంది. ఈ క్రమంలో లక్కీ సింగ్ కారణంగా భామిని ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది? అసలు లక్కీ సింగ్ కి, భామిని ఫ్యామిలీకి సంబంధం ఏంటి? చివరికి లక్కీ సింగ్ మాన్స్టర్ గా ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.
మోహన్ లాల్ సినిమా అంటే ప్రేక్షకులలో మినిమమ్ అంచనాలు నెలకొంటాయి. ఎందుకంటే.. దాదాపు ఆయన సినిమాలలో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో పాటు కంటెంట్ ప్రధానంగా సినిమాలు చేస్తుంటాడు. వయసు పరంగా 62 ఏళ్ళు దాటినప్పటికీ.. ఇంకా హీరోగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. మన్యం పులి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ వైశాక్ తో కలిసి ఈ ‘మాన్ స్టర్’ సినిమా చేశాడు మోహన్ లాల్. మన్యం పులి హిట్ కాంబినేషన్ కాబట్టి.. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే.. ఇదివరకే మలయాళంలో థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా.. తాజాగా హాట్ స్టార్(తెలుగు)లో ఓటిటి రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా ఆరంభం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ.. ముందుకు వెళ్ళినకొద్దీ, కథాకథనాలు లోపించి అనవరమైన డ్రామా క్రియేట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. లక్కీ సింగ్ క్యారెక్టర్ లో మోహన్ లాల్ ఎంట్రీ.. ట్యాక్సీ డ్రైవర్ భామిని క్యారెక్టర్ లో హనీ రోజ్ ఇంట్రడక్షన్ బాగానే రాసుకున్నారు మేకర్స్. కానీ.. సినిమా మొదలైన అర్థగంట తర్వాత ఏం జరగబోతుంది అనేది ఈజీగా ప్రేక్షకులకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా సినిమాలో ఎక్కడినుండో హీరో ఒక కొత్త ఊరిలోకి ఎంట్రీ ఇచ్చాడంటే.. ఒకటి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికైనా వస్తాడు లేదా పాత పగలు ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసుకోవడానికి వస్తాడు.. ఈ సినిమాని కూడా అదే జానర్ లో తీసుకెళ్లాడు దర్శకుడు.
ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో ‘సింపుల్ గై విత్ సీక్రెట్స్’ ఫార్ములాపై ప్లాన్ చేసుకున్న దర్శకరచయితలు.. దాన్ని పూర్తిస్థాయిలో సక్సెస్ ఫుల్ గా ప్రెజెంట్ చేయలేకపోయారు. గతంలో ఇదే ఫార్ములాతో భాషా, వేదాళం లాంటి సినిమాలు తెరమీదకు వచ్చి సక్సెస్ అయ్యాయి. అందులో హీరో బ్యాక్ గ్రౌండ్, గతం బలంగా ఉంటాయి. కానీ.. మాన్స్టర్ లో ఆ మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోయారు. సినిమాలో ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించే సన్నివేశాలు, లేదా కనీసం కదిలించే ఎమోషన్స్ ఏవి సరిగ్గా లేకపోవడం మైనస్ పాయింట్స్. అయితే.. లక్కీ సింగ్ క్యారెక్టర్ లో తలపాగా చుట్టుకొని మోహన్ లాల్ లుక్ చాలా హుందాగా ఉంది.
కట్ చేస్తే.. కొన్ని ఊహించని పరిణామాల మధ్య లక్కీ సింగ్ గతం భామిని ఫ్యామిలీకి తెలిసిపోవడం సాదాగా అనిపిస్తుంది. అందరిముందు మలయాళీ పంజాబీగా చలామణి అవుతున్న లక్కీ సింగ్.. అసలు ఎవరు అనే విషయం సెకండాఫ్ లో రివీల్ చేస్తారు. కాకపోతే.. ఆ ట్విస్ట్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా లేదనే చెప్పాలి. అదీగాక.. భాషా, పోకిరి లాంటి సినిమాలలో ఇలాంటి హైడింగ్ స్క్రీన్ ప్లే ఆల్రెడీ చూసేశాం. కాబట్టి.. లక్కీ సింగ్ అసలు విశ్వరూపం ఏంటో సెకండాఫ్ లో ప్లాన్ చేశారు. కానీ కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు.
ఈ సినిమాలో చాలావరకు లాజిక్స్ వదిలేసి.. మూస ధోరణిలో సాగిన ఫీలింగ్ కలుగుతుంది. మోహన్ లాల్ – ‘మన్యం పులి’ డైరెక్టర్ వైశాక్ ల కాంబినేషన్ అంటే.. ఇలా ఉంటుందని ప్రేక్షకులు అసలు ఎక్సపెక్ట్ చేయలేరు. చివరికి వచ్చేసరికి ప్రేక్షకులు క్లైమాక్స్ విషయంలో కాస్త నిరాశపడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో తెలుగు యాక్టర్స్ మంచు లక్ష్మి, జగపతి బాబు కీలకపాత్రల్లో నటించారు. సినిమాలో అందరూ తమ తమ పాత్రల మేరా పరవాలేదనిపించారు. అయితే.. టెక్నికల్ గా చెప్పుకోవడానికి మాన్స్టర్ లో పెద్దగా అద్భుతాలు ఏమి లేవు. కాగా.. మాన్స్టర్ అనే పవర్ ఫుల్ టైటిల్ కి.. జస్టిఫై అయ్యిందా లేదా ప్రేక్షకులకు ఇట్టే అర్థమైపోతుంది.
ఇందులో స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించి కొన్ని సీన్స్ హైలైట్ అవుతాయి. ఇక సినిమాలో మెయిన్ విలన్ రోల్ కూడా డిసప్పాయింట్ చేసేలా డిజైన్ చేయడం గమనార్హం. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న హీరోకి.. క్లైమాక్స్ లో పవర్ ఫుల్ ఎలివేషన్స్ ఎక్సపెక్ట్ చేస్తే బోర్లా పడినట్లే. ఈ స్క్రిప్ట్ విషయంలో పూర్తి బాధ్యతను రైటర్ ఉదయ్ కృష్ణ – డైరెక్టర్ వైశాక్ వహించాల్సి ఉంటుంది. కాగా.. వానప్రస్థం, స్పదికం, ఇరువర్, కిరీడం లాంటి సినిమాలతో ఐదు జాతీయ అవార్డులు, తొమ్మిది స్టేట్ అవార్డులు అందుకున్న మోహన్ లాల్ కెరీర్ లో ఈ సినిమా ఫ్యాన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.