‘జాతిరత్నాలు’ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయిపోయాడు దర్శకుడు అనుదీప్. ఆ ఒక్క సినిమాతోనే తనలో మంచి రైటర్ ఉన్నాడని ప్రూవ్ చేశాడు. ఇక అనుదీప్ సినీ ప్రమోషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల అనుదీప్ అందించిన కథ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన మూవీ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు శ్రీరామ్, మనవరాలు శ్రీజ నిర్మాతలుగా మారి నిర్మించిన ఈ సినిమా.. తాజాగా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది.
డెబ్యూ డైరెక్టర్స్ వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమాతో.. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అదీగాక పూర్ణోదయా బ్యానర్ లో ఎన్నో క్లాసిక్ సినిమాలు తెరమీదకు వచ్చాయి. ఆ బ్యానర్ మీద గౌరవంతో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, శ్రీకాంత్ ఇలా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీని భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. మరి మినిమమ్ అంచనాలు క్రియేట్ చేసిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథంతా ‘ఖుషి’ సినిమా రిలీజ్ చుట్టూ తిరుగుతుంది. 2001లో ఖుషి సినిమా రిలీజ్ టైమ్ అది. నారాయణ్ ఖేడ్ ఏరియా హెడ్ మాస్టర్ ధర్మరాజు(తనికెళ్ళ భరణి) కొడుకు శ్రీనివాస్(శ్రీకాంత్ రెడ్డి).. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఖుషి సినిమాను సంపాదించి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని టికెట్స్ కోసం ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు శ్రీనివాస్ చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్న లయ(సంచిత) కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఇక శ్రీనివాస్ టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాడని తెలుసుకున్న లయ.. టికెట్స్ కావాలని అడుగుతుంది.
దీంతో ఎలాగైనా ఖుషి సినిమా టికెట్స్ సంపాదించి లయతో కలిసి సినిమా చూడాలని ఫిక్స్ అయిన శ్రీనివాస్.. అప్పటినుండి టికెట్స్ సంపాదించే పనిలో పడతాడు. ఈ క్రమంలో పలు ట్విస్టుల కారణంగా శ్రీనివాస్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మరి తాను ప్రేమించిన అమ్మాయితో ఖుషి సినిమా చూడాలని శ్రీనివాస్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఎందుకు జైలుకు వెళ్ళాడు? ఇంతకీ శ్రీనివాస్ కి టికెట్స్ లభించాయా? లయతో ఖుషి సినిమా చూశాడా లేదా? అనేది తెరపై చూడాల్సిందే.
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న దర్శకులు కొత్త కథలతో పాటు పీరియాడిక్, వింటేజ్ కథలను కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఎందుకునే నేపథ్యం, వాతావరణం 90, 2000 కాలానికి చెందినా.. ప్రధానంగా ఎక్సిక్యూషన్ లో ఫెయిల్ అవుతుంటారు మేకర్స్. కొందరు మాత్రం తెరపై నాటి మ్యాజిక్ ని రిపీట్ చేయగలరు. సినిమా అన్నాక ఆనాటి, ఆ రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుంటే సరిపోదు. ఇప్పుడున్న ప్రేక్షకుల మైండ్ సెట్ కి, అప్ డేటెడ్ అభిరుచులకు అనుగుణంగా ఎలా మలిచారు అనేది పరిగణలోకి వస్తుంది.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీని 2001లో ఖుషి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో సెట్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ ముందు టికెట్స్ కోసం హీరో హీరోయిన్స్ ఏం చేశారనే సబ్జెక్టు ఇంటరెస్టింగ్ గానే ఎంచుకున్నా, ట్రైలర్ చూసినవారందరికీ ఇది మరో జాతిరత్నాలు కాబోతుందా అనే సందేహాలు కలిగాయనే చెప్పాలి. ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కథాకథనాలు అందించేసరికి.. ట్రైలర్ లో కామెడీ కూడా అలాగే అనిపించింది. అంటే.. సింగిల్ లైన్ సినిమా.. లాజిక్స్ వెతకకుండా కేవలం కామెడీని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట.
ఇప్పుడు ఈ సినిమాను అదే తరహాలో రూపొందించారు మేకర్స్. 2001లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ వాడకాలు లేవు. ఎవరైనా థియేటర్లకు వెళ్లే సినిమా టికెట్స్ కొనుక్కోవాల్సి ఉండేది. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు కదా.. సోషల్ మీడియా, నెట్ సౌకర్యంతో సినిమా టికెట్స్ ఇంట్లో కూర్చొని బుక్ చేసుకుంటున్నారు. అయితే.. ఈ సినిమాలో సోషల్ మీడియా, ఆన్ లైన్ టికెట్స్ లేనప్పుడు ప్రేక్షకులు ఎలాంటి కష్టాలు పడేవారో చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు. ఆ రోజుల్లో టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు, పోరాటాలు ఎన్నో గాయాలను మిగిల్చేవి.
అవన్నీ జరిగి థియేటర్ లో అడుగుపెట్టి సినిమా చూసి.. బయట జరిగిన డామేజిస్ అన్ని మర్చిపోయేవారు. ఈ సినిమాలో చిన్న అంశాలన్నీ జోడించి కామెడీ పండించే ప్రయత్నం చేశారు. అప్పట్లో హీరోలకు వీరాభిమానులు ఎలా ఉండేవారు అనేది బాగా చూపించారు. అయితే.. సినిమా మొదలైనప్పటి నుండి హీరోకి ఖుషి సినిమా చూడాలనేది మాత్రమే లక్ష్యం.. అందులో హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉండటంతో ఆమెకోసం టికెట్స్ సంపాదించాలనే తాపత్రయం చుట్టూనే కథ సాగడం అనేది బోర్ ఫీల్ కలిగించవచ్చు. ఎందుకంటే.. ట్విస్టులు, లాజిక్ లేని కామెడీ.. అన్ని కూడా జాతిరత్నాలు మూవీ నుండే ఇన్స్పైర్ అయ్యారేమో అనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో కొన్ని యథార్థ సంఘటనలను ఆధారం చేసుకొని తీశామని చెప్పిన సీన్స్ నిజంగా జరిగాయా? అనే సందేహాలు కలిగి, ఇప్పుడున్న ట్రెండ్ కి, మైండ్ సెట్ కి కొత్తగా కంటే.. అవునా అనిపిస్తాయి. అయితే.. ఈ సినిమాలో సాంగ్స్ ఏమోగానీ, కామెడీ బాగుంది. అలాగని సినిమా అంతా నవ్విస్తుందని చెప్పలేం. అక్కడక్కడా నవ్వించి.. మిగిలిన చోట లాజిక్స్ మిస్ అయ్యేసరికి, సింగిల్ లైన్ సినిమా కదా.. కేవలం కామెడీ వరకే ఎంజాయ్ చేయాలేమో అనిపిస్తుంది. ఇక కథంతా ఒకే దగ్గర జరుగుతుంది.. అనే ఫీల్ మైనస్ కావచ్చు.
ఇదిలా ఉండగా.. సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ బాగున్నాయి. యాక్టర్ నుండి డైలాగ్ డెలివరీని బాగా రాబట్టుకున్నారు దర్శకులు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమాకు అనుగుణంగా ఉన్నాయి. ఇక శ్రీనివాస్ పాత్రలో శ్రీకాంత్ రెడ్డి మెప్పించాడు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. హీరోయిన్ సంచిత ఉన్నంతలో చక్కగా నటించింది. మిగతా నటీనటులంతా వారి పరిధిమేర ఆకట్టుకున్నారు. మరి డెబ్యూ డైరెక్టర్స్ కాస్త కథలో మరిన్ని ట్విస్టులు, ఇంటరెస్టింగ్ మలుపులు జోడించి ఉంటే బాగుండేది.
చివరిమాట:
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.)