తెలుగులో ఇప్పటిదాకా మలయాళం సూపర్ హిట్ సినిమాలు చాలా రీమేక్ అవుతూ వచ్చాయి. కంటెంట్ నచ్చితే స్టార్ హీరోల నుండి యంగ్ స్టర్స్ వరకు రీమేక్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మలయాళం సూపర్ హిట్స్ నుండి భీమ్లానాయక్, గాడ్ ఫాదర్ మూవీస్ తర్వాత ‘బుట్టబొమ్మ’ మూవీ తెరపైకి వచ్చింది. ఇది మలయాళం ‘కప్పేలా’ మూవీకి ఆఫీషియల్ రీమేక్. అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్స్ లో విడుదలైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన ఈ సినిమాని శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ తెరకెక్కించారు. మరి ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేసిన బుట్టబొమ్మ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
సత్య(అనిఖా సురేంద్రన్) అరకులో చిన్న విలేజ్ కి చెందిన అమ్మాయి. రైస్ మిల్లులో పనిచేసే తండ్రి, మిషన్ కుట్టే తల్లి.. స్కూల్ కి వెళ్లే ఓ చెల్లి.. ఇది సత్య ఫ్యామిలీ. సత్యకి ఓ డబ్బా ఫోన్.. సీక్రెట్ గా సత్య ఫోన్ లో లవర్ తో మాట్లాడే ఓ ఫ్రెండ్. సత్యను ఎప్పటినుండో ఇష్టపడుతున్న మేనబావ. అలా రెగ్యులర్ గా సాగిపోతున్న సత్య లైఫ్ లోకి ఓ రాంగ్ కాల్ ద్వారా ఎంటర్ అవుతాడు ఆటోడ్రైవర్ మురళీ(సూర్య వశిష్ఠ). ఇంట్లో తెలియకుండా మురళీతో ఫోన్ లో మాట్లాడి లవ్ లో పడుతుంది సత్య. కట్ చేస్తే.. మురళీ కోసం సత్య వైజాగ్ వెళ్తుంది. అదే టైమ్ లో సత్య లైఫ్ లోకి ఆర్కే(అర్జున్ దాస్) ఎంట్రీ ఇస్తాడు. అక్కడినుండి సత్య లైఫ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. మరి సత్య లైఫ్ లోకి ఆర్కే ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఇంతకీ మురళీని కలిసిందా లేదా? మురళీతో సత్య ప్రేమ ఏమైంది? అసలు ఆర్కే ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఈ మధ్యకాలంలో కంటెంట్ పరంగా సినిమాలు ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. మంచి కంటెంట్ అనేది ఎక్కడో దొరకదు. కొన్నిసార్లు మన చుట్టూ.. మన రెగ్యులర్ లైఫ్ లో జరిగిన సంఘటనలే తెరపై గొప్ప కథలుగా పాపులర్ అవుతాయి. అలా మన చుట్టూ జరిగే కథల నుండి పుట్టిందే ఈ బుట్టబొమ్మ. మలయాళంలో సూపర్ హిట్ అయిన కప్పేలా మూవీ.. ఏ రేంజ్ లో ప్రశంసలు అందుకుందో తెలిసే ఉంటుంది. ఆ మూవీ తెలుగులో రీమేక్ అంటే.. ప్రేక్షకులలో కాస్త ఆసక్తి ఏర్పడింది. పైగా తెలుగు ప్రేక్షకులు, యూత్ కి కూడా తెలియాల్సిన ముఖ్యమైన పాయింట్ ఈ కథలో ఉంది. అలా సితార ఎంటర్టైన్ మెంట్స్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో బుట్టబొమ్మ తెలుగులో తెరరూపం దాల్చింది.
ఇటీవల ఓటిటిలు వచ్చేశాక చాలామంది అన్నీ భాషల సినిమాలను చూసేస్తున్నారు. సో.. ఆల్రెడీ కప్పేలా చూసినా తెలుగులో ఎలాంటి మార్పులు చేశారు? అనే ఆలోచన కూడా మొదలైంది. ఈ క్రమంలో మొత్తానికి అనికా సురేంద్రన్, అర్జున్ దాస్ ల క్రేజ్ తో.. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బుట్టబొమ్మ.. స్టోరీలో కంటే.. క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ లో సోల్ ఉంది. కథగా చెప్పుకుంటే ఇది సింపుల్ లైన్. కానీ.. తెరపై ప్రెసెంట్ చేయాలంటే గట్స్ ఉండాలి. కేవలం రెండే రెండు ట్విస్టులతో సినిమాను రెండు గంటలపాటు నడిపించారు. అయితే.. ఒరిజినల్ సినిమా నుండి స్క్రీన్ ప్లేని, క్యారెక్టర్స్ ని ఏమాత్రం చేంజ్ చేయలేదు.
అరకులో దూదికొండ అనే అందమైన విలేజ్.. ఆ విలేజ్ లో అందమైన అమ్మాయి సత్య(అనిఖా) క్యారెక్టర్ తో పాటు తన ఫ్యామిలీ.. రెగ్యులర్ రొటీన్స్ ని పరిచయం చేస్తూ సినిమా మొదలైంది. సత్యకి ఫ్రెండ్ లక్ష్మీ.. ఎప్పుడు సత్య డబ్బా ఫోన్ లో లవర్ తో మాట్లాడుతుంటుంది. అలా సాగిపోతున్న సత్య లైఫ్ లోకి రాంగ్ కాల్ ద్వారా ఆటోడ్రైవర్ మురళీ ఎంటర్ అవ్వడం.. అక్కడినుండి ఇద్దరి మధ్య పరిచయం.. ప్రేమ చూపిస్తూ.. మధ్యలో సత్య మేనబావ.. సత్యకి పెళ్లి చూపులు.. ఇలాంటి టైమ్ లో ఓ షాకింగ్ ట్విస్టుతో ఇంటర్వెల్ పడింది. కట్ చేస్తే.. సెకండాఫ్ లో ఆర్కే క్యారెక్టర్ లో అర్జున్ దాస్ ఎంట్రీ బాగుంది.
అప్పటినుండి కథలో వేగం పుంజుకుంటుంది. సత్యకి ఓవైపు ఆటోడ్రైవర్ మురళీ.. మరోవైపు ఆర్కే.. కేవలం మొబైల్ లో కాల్స్ మాట్లాడి లవ్ లో పడిన సత్య చుట్టూ.. ఊహించని పరిణామాలు.. వీటన్నింటి మధ్య మరో షాకింగ్ ట్విస్టుతో ప్రీక్లైమాక్స్.. చివరిలో మంచి మెసేజ్ ఇస్తూ సినిమా ఎండ్ అయ్యింది. మొదటి నుండి చివరిదాక మూవీ ప్లీజంట్ గానే సాగింది. రెండు సాంగ్స్ బాగున్నాయి. ఓ సాంగ్ బాగున్నా ప్లేస్ మెంట్ కుదరలేదు. ఓరల్ గా అలా యూత్ ఫుల్ సీన్స్.. బ్యాక్ డ్రాప్ తో బుట్టబొమ్మ ఎంటర్టైన్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ.. మ్యూజిక్ సినిమాకి మేజర్ టెక్నికల్ ప్లస్ లు. అయితే.. కప్పేలా చూడనివారిని ఈ బుట్టబొమ్మ సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంది.
ఇక కథ చిన్న పాయింట్ కాబట్టి.. సినిమా లెన్త్ కూడా రెండు గంటలకే కుదించారు. పైగా మధ్యలో మొబైల్ కాల్స్.. లవ్ ట్రాక్ సంభాషణలు రొటీన్ గా అనిపిస్తాయి. కానీ.. కొన్ని చోట్ల అనిఖా క్యారెక్టర్ ని ఇంకాస్త ఎమోషనల్ గా డిజైన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఓరల్ గా బుట్టబొమ్మ మంచి మెసేజ్ ఇచ్చే ఫీల్ గుడ్ మూవీ. లీడ్ రోల్ లో సత్యగా అనిఖా సురేంద్రన్ యాక్టింగ్ బాగుంది. తెలుగు డైలాగ్స్ చక్కగా పలికింది. కొన్నిసార్లు ఇంకా చిన్నపిల్లే అనిపించింది. ఆర్కే క్యారెక్టర్ లో అర్జున్ దాస్ న్యాయం చేశాడు. అతనికి వాయిస్ మేజర్ ప్లస్. ఇక ఆటోడ్రైవర్ మురళీ క్యారెక్టర్ లో డెబ్యూ యాక్టర్ సూర్య వశిష్ఠ మెప్పించాడు.
టెక్నికల్ గా సినిమాకి కెమెరా వర్క్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్. అరకు అందాలను కొన్ని షాట్స్ లో బాగా కవర్ చేశారు. ఇక నాగవంశీ, సాయి సౌజన్యల ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గోపి గణేష్ రావూరి స్క్రీన్ ప్లే, మాటలు అదిరిపోయాయి అనలేం. కానీ ఓకే. దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ తన పని తాను చేసుకుపోయాడు. సినిమాలో మెరుపులు మాత్రం కనిపించలేదు. సినిమా అక్కడక్కడా సూపర్ అనిపిస్తూ.. ఇంకా బలమైనది ఏదో ఉండాల్సింది అనే ఫీల్ మాత్రం మిగిల్చింది. బట్.. మొదటిసారి చూసే ఆడియన్స్ కి, యూత్ కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
చివరిమాట: బుట్టబొమ్మ.. విషయం ఉంది!
రేటింగ్: 2.5/5