ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చూడటం అలవాటు చేసుకున్నారు ఆడియెన్స్. కొత్తగా ఏ ఓటిటిలో ఏది రిలీజ్ అయినా ఇంట్లో కూర్చొనే అనందంగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘యాంగర్ టేల్స్’ అని అంథాలజీ సిరీస్ రిలీజ్ అయ్యింది. హీరో సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, వెంకటేష్ మహా, బిందు మాధవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్ ని.. డైరెక్టర్ నితిన్ ప్రభల తిలక్ తెరకెక్కించాడు. ఈ సిరీస్ లో నటించడమే కాకుండా నిర్మాణంలో కూడా భాగమయ్యాడు హీరో సుహాస్. మరి ట్రైలర్, ప్రమోషన్స్ తో ఆకట్టుకున్న ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
ఈ సిరీస్ కథ మొత్తం నాలుగు కథలను చూపిస్తోంది. మొదటి కథ రంగా(వెంకటేష్ మహా) ఓ స్టార్ హీరో ఫ్యాన్.. తన హీరో బెనిఫిట్ షో కోసం ఏం చేశాడు? అనేది పాయింట్. రెండో కథలో పూజా రెడ్డి(మడోనా సెబాస్టియన్).. పెళ్లి చేసుకున్నాక అత్తవారింట తిండి విషయంలో పెట్టే కండిషన్స్ మధ్య నలిగిపోతుంటుంది..? మూడో కథలో రాధ(బిందు మాధవి) సాధారణ గృహిణి. నిద్ర విషయంలో ఇంటి ఓనర్స్, వాళ్ళ రిలేటివ్స్ వల్ల బాగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది? నాలుగో కథలో గిరిధర్(ఫణి ఆచార్య) అనే మిడిల్ ఏజ్ పర్సన్. తన బట్టతల వలన, జాబ్స్ వలన ఎన్నో ఇబ్బందులు, ఫ్రస్ట్రేషన్ కి గురవుతాడు? ఈ నాలుగు కథలలో ఫ్రస్ట్రేషన్, కోపాలు కామన్. మరి వాటిని వీళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు? వారి లైఫ్ లో యాంగర్ అనేది ఎలాంటి ప్రభావం చూపింది? చివరికి వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? అనేది సిరీస్ లో చూడాల్సిందే.
ఈ సిరీస్ లో ఒక్కో కథలో ఒక్కో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం బాగుంది. మొదటగా ఇందులో ఎంచుకున్న యాంగర్ అనే కోర్ పాయింట్.. నాలుగు కథలలోనూ కామన్ గా కంటిన్యూ అవుతుంది. కానీ.. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. లైఫ్ స్టైల్, వారి చుట్టూ అల్లుకున్న పరిస్థితులు, ఎమోషన్స్.. ఇలా అన్ని అంశాలను కలిపి దర్శకుడు సిరీస్ ని అంథాలజీగా రూపొందించినందుకు అభినందించాలి. అయితే.. ఈ సిరీస్ కి ముందుగా తెలిసిన ముఖాలు లీడ్ క్యారెక్టర్స్ కావడమే.. బజ్ కి బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి. కలర్ ఫోటో, పద్మభూషణ్ లతో హిట్స్ లో ఉన్న సుహాస్, బిగ్ బాస్ బిందుమాధవి, మడోనా సెబాస్టియన్, డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్, వెంకటేష్ మహా ప్రధాన పాత్రలలో కనిపించి సర్ప్రైజ్ చేశారు.
దీనికి మరో సర్ప్రైజ్ ఏంటంటే.. ఈ సిరీస్ ని నిర్మాత శ్రీధర్ రెడ్డితో కలిసి హీరో సుహాస్ కూడా నిర్మించాడు. అంటే.. సుహాస్ నుండి సినిమా వస్తుందంటే.. మినిమమ్ అంచనాలు ఉంటాయి కదా.. అలా సుహాస్ పేరు వినిపించేసరికి ఈ ‘యాంగర్ టేల్స్’పై కూడా ప్రేక్షకులలో అటెన్షన్ మొదలైంది. ఇక సిరీస్ లోకి వెళ్తే.. ముందుగా రీసెంట్ సెన్సేషన్ ‘వెంకటేష్ మహా’ చేసిన రంగ క్యారెక్టర్. ఇందులో స్టార్ హీరో అభిమానిగా సినిమా బెనిఫిట్ షోస్ కోసం పడే ఆరాటం.. రియల్ గా ఫ్యాన్స్ ఫీలయ్యే ఎమోషన్ కి దగ్గరగా ఉందని చెప్పాలి. డైరెక్టర్ అయినప్పటికీ.. చేసిన రోల్ కి నటుడిగా న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. కొన్ని షాట్స్ లో ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి.
వెంకటేష్ కనిపించే ఎపిసోడ్ మిగతా వాటికంటే ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. కాగా.. ఇందులోనే ఫన్ యాడ్ చేయడం మరో పాయింట్. ఇదే ఎపిసోడ్ లో సుహాస్ కూడా రోల్ ని స్ట్రాంగ్ గా పండించాడు. ఇక పూజా రెడ్డి క్యారెక్టర్ లో మడోనా, రాధా క్యారెక్టర్ లో బిందు మాధవి నటన రియల్ లైఫ్ హౌస్ వైఫ్ లకు దగ్గరగా అనిపిస్తాయి. వీరి కథలలో ఫ్రస్ట్రేషన్ తో పాటు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. పెళ్ళైన జనాలు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మడోనా.. తరుణ్ భాస్కర్ ల ఎపిసోడ్ తో పాటు బట్టతల వ్యక్తిగా ఫణి ఆచార్య క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. రెగ్యులర్ గా ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ లో జాబ్, బాస్.. రెస్పాన్సిబిలిటీస్ ఇలా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి.
అన్నింట్లో ప్లస్ లు, మైనస్ లు ఉన్నట్లుగానే.. ఈ నాలుగు కథల సిరీస్ లోనూ మైనస్ లు లేకపోలేదు. కొన్ని చోట్ల చాలా ఓల్డ్ సినిమాలు, సన్నివేశాల రిఫరెన్సులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫణి ఆచార్య ఎపిసోడ్ లో హిందీ బాల మూవీ పోలికలు ఉంటాయి. బిందు మాధవి ఎపిసోడ్ లో స్ట్రాంగ్ నెస్ మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. కానీ.. ఎమోషన్స్ కి కరెక్ట్ అవుతారు. కానీ.. కొన్ని చోట్ల నేరేషన్ ఇంకా సాలిడ్ గా ఉండాల్సిందేమో అనిపిస్తుంది. అయితే.. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక్కో క్యారెక్టర్ ఎలా తనలోని యాంగర్ ని జయించింది? ఎలా కంక్లూషన్ ఇచ్చారు అనేది రెండు ఎపిసోడ్స్ లో ఇంటరెస్టింగ్.. మరో రెండు ఎపిసోడ్స్ లో చప్పగా అనిపించింది. ఎందుకంటే.. వెంకటేష్ మహా ఎపిసోడ్ లో ఉన్న ఎంగేజింగ్ నెస్.. మిగతా వాటిలో అక్కడక్కడా మాత్రమే కనిపిస్తుంది. కొన్ని చోట్ల బూతులు కూడా ఉండటం గమనార్హం. బట్.. ఈ మధ్య మామూలే అయిపోయాయిగా.. లైట్ తీసుకొని కంటిన్యూ చేయడమే!
ఇక ఈ సిరీస్ లో అందరి పెర్ఫార్మన్స్ లు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఎమోషన్స్ ని ఎలివేట్ చేస్తూ.. స్మరన్ సంగీతం బాగుంది. కెమెరా వర్క్ నాలుగు కథలకు నలుగురు వర్క్ చేశారు.. న్యాయం చేశారు. డైలాగ్స్ సన్నివేశాలకు అనుగుణంగా ఉన్నాయి.. కానీ, స్క్రీన్ ప్లే ఇంకాస్త ఎంగేజింగ్ గా ఉంటే ఫుల్ ప్యాకెడ్ బిర్యానీ అయ్యుండేది.ఇక దర్శకుడు ప్రభల తిలక్ విషయానికి వస్తే.. మొదటి ప్రయత్నం బాగా చేశాడు. గతంలో సుహాస్ తోనే షార్ట్ ఫిలిం చేసి.. ఈ సిరీస్ తో డెబ్యూ చేశాడు. ఓరల్ గా ఓకే అనిపించాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెండు కథలను బాగా హ్యాండిల్ చేశాడు. మరి ఆ కథలు ఏంటనేది చూశాక మీకే అర్థమవుతుంది.