సీనియర్ నేత “YS వివేకానందరెడ్డి”ని ఈమాద్యే గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణపై నమ్మకం లేదని AP ప్రతిపక్ష నేత, YCP అధినేత జగన్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతడే కాక వివేకా కుమార్తె “సునీత” కూడా ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు పిర్యాదు చేసిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు.
ఎవరు ఎన్ని ఆరోపణలు చేసిన సిట్ మాత్రం తన పనితాను చేసుకుంటూ వెళ్తుంది. ఇలాంటి సమయంలో చేసేదిలేక చివరికి వివేకానందరెడ్డి భార్య “సౌభాగ్యమ్మ” ఈరోజు AP హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని సౌభాగ్యమ్మ గారు తెలిపారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు లేదా మూడో పార్టీతో విచారణ జరిపించాలని ఆమెకూడా విజ్ఞప్తి చేశారు. వివేకా హత్యను కేంద్రంగా చేసుకొని అధికార, విపక్షాల మధ్య విమర్శల దాడి సరికాదని ఆమె హెచ్చరించారు. ఒక వైపు సిట్ విచారణ కొనసాగుతుండగానే వివేకానందరెడ్డి భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది