చంద్రబాబు, లోకేష్‌పై ధాటిగా చేస్తున్న విమర్శలు, వైఎస్ జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకున్న తీరు, ఎప్పటికప్పుడు విసురుతున్న చలోక్తులు వెరసి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని వైఎస్ షర్మిల చెబుతున్నారు.
వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఇస్తున్న పిలుపుకు ప్రజల నుంచి అనూహ్య రీతిలో స్పందన వస్తోంది. అయితే, షర్మిల చేపట్టిన బస్సు యాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే నాలుగు సభల్లో షర్మిల పాల్గొననున్నారు. ఉండి, గోపాలపురం, నిడదవోలు, నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల ప్రచారం చేయనున్నారు.