చంద్రబాబు, జగన్ ల మద్య ఎన్నికల సమరం ఓరాఓరిగా నడుస్తుంది. ప్రతిరోజూ తీరిక లేకుండా భయిరంగా సభల్లో పాల్గొంటున్న ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. నువ్వా నేనా అనేలా దూసుకెళ్తున్నా ఈ నేతలు హామీలు కూడా అదే స్థాయిలో ఇస్తున్నారు. అందులో బాగంగానే పాడేరు సభలో పాల్గొన్న YS జగన్ మోహన్ రెడ్డి గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు.
అలాగే ప్రతి ఐటిడిఎ పరిధిలోనూ ఒక సూపర్ స్పషాల్టీ హాస్పిటల్ కట్టించి తీరుతామని… గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడమే కాకుండా.. ఆ జిల్లాలో గిరిజన యూనివర్శిటీ, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్దికి పూర్తి సహకారం అందిస్తామని పాడేరు భయిరంగా సభలో YCP అధినేత “YS జగన్మోహన్ రెడ్డి హామీ” ఇచ్చారు.