AP ప్రతిపక్ష నేత YS జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియాలోని ఒక వర్గం చంద్రబాబుకు అమ్ముడుపోయింది.. ఆ మీడియా సాయంతో ఈ పెద్దమనిషి మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు అన్ని రకాల “స్కీమ్”లతో ప్రజలను వంచించడానికి రెడీగా ఉంటాడని.. అందుకు కొన్ని మీడియా సంస్థలు అండగా నిలుస్తున్నాయని మండిపడ్డారు YS జగన్.
ఇక 1994 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు గారు ఇలాగే మోసం చేశాడు. ముందు ప్రతి పేదవాడికి రూ.2లకే కిలో బియ్యం ఇస్తానని.. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తామని చెప్పి ఓట్లు అడుకున్నాడు.. అది నిజమే అని నమ్మి ప్రజలు ఓట్లు వేసి బాబును గెలిపించారు.. కానీ గెలిచిన ఏడాదిలోనే అంటే 1995లో కిలో బియ్యం ధర రూ.5.25 పెంచాడు.. ఇక మద్యనిషేధాన్ని అయితే కూకటివెళ్లతో ఎత్తివేశాడు.. ఇది చంద్రబాబు గారి అసలు చరిత్ర అంటూ బాబుపై సంచలన ఆరోపణలు చేశాడు జగన్.