YSRCP పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఆయన క్యాడర్ కు ప్రజలపై ఉన్న నమ్మకం చరిత్రలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి లేదు.. భవిష్యత్ లో రాదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు “YS జగన్” ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అవ్వలేదు. రాజకీయ అనుభవం కూడా పెద్దగా లేదు. అలాంటి ఆయన 2 ఏళ్ల క్రితమే APకి కాబోయే ముఖ్యమంత్రిని నేనే అని అనౌన్స్ చేశాడు. పైగా రాజన్న రాజ్యం త్వరలో రాబోతుంది.. నేను ముఖ్యమంత్రి అయ్యకా మీకు ఏ కష్టాలు ఉండవు అని ఆంధ్ర ప్రజలకు హామీ ఇస్తున్నాడు జగన్.
నిజానికి ఇంత నమ్మకంగా కాబోయే ముఖ్యమంత్రిని నేనే అని చెప్పిన ప్రతిపక్ష నాయకుడు దేశ చరిత్రలో ఒక్కరూ లేరు. ఏ నాయకుడైనా “మీరు ఆశీర్వదిస్తే.. దేవుడు కనికరిస్తే.. నేను ముఖ్యమంత్రి అయితే మీ కష్టాలు తీరుస్తా” అంటాడు తప్ప జగన్ లా అంత నమ్మకంగా చెప్పిన నాయకుడు ఒక్కరూ లేరు. అందుకే APకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరా ? అనే చర్చ ఈమద్య హాట్ టాపిక్ అయ్యింది.
ఇలాంటి సమయంలో జగన్ ఒక్కడే కాదు.. ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా అంతే నమ్మకంగా APకి కాబోయే ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి.. పలానా రోజున ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నాడు అని YCP నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అందులో బాగంగానే “YSR కాంగ్రెస్” నేత దాడి సెట్టి వీరభద్రరావు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
CM చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలకు కుతంత్రాలకు పడినా “జగన్మోహన్ రెడ్డి” విజయాన్ని ఎవ్వరు ఆపలేరని దాడి సెట్టి వీరభద్రరావు స్పష్టం చేశారు. తాజాగా పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర సమస్యలపై అధికార తెలుగుదేశం పార్టీని విమర్శించకుండా ప్రతిపక్షాన్ని విమర్శించడం దారుణం.. 5 ఏళ్ల పరిపాలన చూపి ప్రజలను ఓట్లు అడగలేని తెలుగుదేశం నాయకులు అక్రమంగా ప్రజలకు డబ్బులు ఎరవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
TDP నాయకులు ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా.. ప్రజలు మాత్రం YCP కే మద్దతుగా ఉన్నారని.. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అంటూ “దాడి సెట్టి వీరభద్రరావు” ధీమా వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని ఆయన వచ్చేనెల “మే”, 23వ తేదీన AP ముఖ్యమంత్రిగా “జగన్ మోహన్ రెడ్డి” ప్రమాణ స్వీకారం చేస్తారని దాడి వీరభద్రం చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.