గుండెపోటుతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి.. సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

MLC

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతల అకాల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ లో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మృతి చెందారు. నిజానికి శుక్రవారం జరిగిన ఆమండలి సమావేశానికి కూడా మహ్మద్ కరీమున్నీసా హాజరయ్యారు. ఇంత ఆరోగ్యంగా ఉన్న ఆమెకి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయారు.

కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ఫలలితం లేకుండా పోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో మహ్మద్ కరీమున్నీసా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ గూటికి చేరిన మహ్మద్ కరీమున్నీసాకి పార్టీ విధేయురాలిగా పేరుంది. ఈ క్రమశిక్షణ కారణంగానే కరీమున్నీసాకి గత ఏడాది ఎమ్మెల్సీగా సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఇక మున్నీసా మృతిపట్ల వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు.