Home రాజకీయాలు ఏపి వార్తలు రోజా “రాఖీ” రాజకీయం : చిత్తూరు ఫైర్ బ్రాండ్

రోజా “రాఖీ” రాజకీయం : చిత్తూరు ఫైర్ బ్రాండ్

roja thumb

వైకాపా పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు “ఎమ్మెల్యే రోజా”.పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నుండి దూరం చేసిన ఏనాడు పార్టీని విడిచిపెట్టలేదు రోజా. 2019 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైయస్సార్.సిపి పార్టీ ఘన విజయం సాదించింది. జగన్ క్యాబినెట్ లో రోజుకు మంత్రి పదవి దక్కుతుందని అందురు అనుకున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం రోజాకు మంత్రి పదవి కట్టబెట్టే లేదు.

దీనితో అలక చెందిన రోజా కొన్ని రోజులు పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తరువాత సీఎం జగన్ ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినా అసంతృప్తి జ్వాలలు తగ్గలేదు . దీనికి ప్రధాన కారణం సొంత పార్టీలోనే ఆమెను అణగదొక్కుతున్నారాని ఆమె అభిప్రాయం. అప్పటి నుండి రోజా రాజకీయం చిత్తూరులో వివాదాలకు కారణం అవుతూ వచ్చింది. ముఖ్యంగా జిల్లాలో మంత్రిగా ఉన్నపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వివాదం తార స్థాయికి చేరింది.

2019 లో జరిగిన ఎన్నికల్లో తనను ఓడించడానికి ప్రయత్నించడంతో పాటు మంత్రి పదవి దక్క కుండా చేశారని సంచలన ఆరోపణలు చేశారు రోజా. ఒకనొక దశలో మీడియా వేదికగానే కంటతడి పెట్టుకున్నారు. మరో వైపు నగరి మున్సిపల్ ఛైర్మన్ భర్త కెజి కూమార్,కెజి శాంతి కుటుంబంతో కూడా వైరం ఎప్పటి నుండో నడుస్తుంది. తాజగా జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల ఈ రెండు వర్గాల మధ్య వైరం తారాస్దాయికి చేరింది. ఎమ్మెల్యే రోజా తన అనుచరులు ఎవరు వారికి సహకరించవద్దని హుకుం జారీ చేసింది.

వివాదం కొనసాగుతుండగానే కెజి కుమార్ షస్టిపూర్తి వేడుకలకు మంత్రి పెద్దిరెడ్డి,డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ హాజరుకావడంతో పార్టీ తనను ఒంటరి చేస్తున్నారని భావనకు ఆమె వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వివాదాలు అందరికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఎమ్మెల్యే రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపి మిధున్ రెడ్డికి రాఖీ కట్టి అందరికి షాక్ ఇచ్చింది. క్రితం వరకు పెద్దరెడ్డి వర్గానికి రోజా వర్గానికి పడేది కాదు. కానీ రోజా “రాఖీ” రాజకీయంతో పరిస్థితులన్నీ ఒక్కసారి మారిపోయాయి. పార్టీలో అందరితో గొడవ పెట్టుకోవడం కంటే సఖ్యతగా ఉండడం మంచిదని రోజా అందుకున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ రోజా తన మార్క్ రాజకీయాన్ని ప్రారంభించిందని చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad