Home రాజకీయాలు ఇకనైనా మేల్కొంటారా?

ఇకనైనా మేల్కొంటారా?

తెలంగాణ కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో దొర్లిన పొర‌పాట్ల‌ను తెలుసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవి పున‌రావృతం కాకుండా చూడాల‌ని నిర్ణ‌యించింది. అయితే, ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల గాంధీ భ‌వ‌న్‌లో కాంగ్రెస్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ బాధ్యుల‌తో ఆ పార్టీ ముఖ్య నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ముఖ్య నేత‌లు కుంతియా, ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిలు ఆదిలాబాద్, పెద్ద‌ప‌ల్లి, నిజామాబాద్, కరీంన‌గ‌ర్‌, జ‌హీరాబాద్‌, వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌పై స‌మీక్ష జ‌రిపారు. అయితే, ఈ స‌మావేశానికి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, అజారుద్దీన్‌లు గైర్హాజ‌రు కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ‌కు దారి తీసింది.

ఇదిలా ఉండ‌గా, స‌మావేశంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేత‌లు మాట్లాడుతూ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అయినా అభ్య‌ర్థుల‌ను ముందుగానే ప్ర‌క‌టించాల‌ని కోరారు అధిష్టానాన్ని కోరారు. అలాగే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార పార్టీ 90 రోజుల ముందు నుంచి ప్ర‌చారం చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం తొమ్మిది రోజుల‌కు ముందు ప్ర‌చారానికి వెళ్లిన‌ట్లు ఉంద‌న్నారు. పార్టీ ప్ర‌చార సామాగ్రి అయినా ముందే పంపిస్తే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అలా చేయ‌క‌పోవ‌డ‌మే కాంగ్రెస్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఎమ్మెల్యే ఆత్రం స‌క్కు మాట్లాడుతూ ఆదివాసీల‌కు ఆదిలాబాద్ ఎంపీ సీటు, లంబాడీల‌కు మ‌హ‌బూబాబాద్ ఎంపీ సీటు ఇవ్వాల‌ని సూచించారు. పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో కూడా ఒకేర‌క‌మైన అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. నిజామాబాద్ నాయ‌కుల స‌మీక్షలో పార్టీ నాయ‌కుల స‌హ‌కార లోపంపై చ‌ర్చ జ‌రిగింది.

మ‌రో ప‌క్క పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల బాధ్య‌త‌లను అప్ప‌గించారు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన అభ్య‌ర్థులే పంచాయ‌తీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు చేప‌ట్టి, వారే ఇన్‌చార్జిలుగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. మొత్తానికి మొన్న‌టి వ‌ర‌కు ఈవీఎంలను నిందించిన కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌స్తుతం రాజ‌కీయ కార‌ణాల‌పై దృష్టి పెట్ట‌డంతో పార్టీ కేడ‌ర్‌లో ఉత్సాహం నెల‌కొంది. ఏదేమైనా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌నాటికైనా మారుతారో లేదో చూడాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad