Home రాజకీయాలు ఏపి వార్తలు ‘గంట’ కొట్టని వైసీపీ.. ఎందుకో తెలుసా?

‘గంట’ కొట్టని వైసీపీ.. ఎందుకో తెలుసా?

Why Ganta Sreenivasa Rao Did Not Join YSRCP

టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆ పార్టీ నుండి అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీలో చేరబోతున్నాడంటూ గతకొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. ఆగస్టు 16న గంటా వైసీపీ కండువా వేసుకోనున్నాడని వార్తలు రావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కానీ అనుకున్న సమయానికి గంటా వైసీపీలో చేరలేదు. మరి ఆయనను వైసీపీ ఎందుకు హోల్డ్‌లో పెట్టిందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

కాగా వైసీపీ అధిష్టానం గంటాను తమ పార్టీలోకి తీసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది. గతంలో అధికారంలో ఉన్న గంటా తన వ్యాపారాలను పెంచుకునేందుకు తన మేనల్లుడు విజయ్‌తో కలిసి పెద్దఎత్తున గోల్‌మాల్ చేశాడని ఇటీవల ఓ టీవీ ఛానల్ బట్టబయలు చేసింది. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం ఆరా తీసింది. కాగా గంటా పార్టీలో చేరితే వైసీపీకి చెడ్డ పేరు రావచ్చనే వాదన ఎక్కువగా వినిపించడంతోనే ఈ మేరకు అతడిని పార్టీలో ఇంకా చేర్చుకోలేదట ఆ పార్టీ అధిష్టానం.

ఇక పలువురు సీనియర్ నేతలు కూడా గంటా చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డి లాంటి వారు కూడా గంటా చేరికను వ్యతిరేకించడంతో వైసీపీ అధిష్టానం హోల్డ్‌లో పెట్టంది. మరి ఈ అవమానంతో గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా గంటా శ్రీనివాసరావు చేరికకు వైకాపా గంట కొట్టకపోవడం ప్రసుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిందని చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad