Home రాజకీయాలు జాతీయ వార్తలు భారత్ కరోనా మృతుల వెనుక అసలు రహస్యం?

భారత్ కరోనా మృతుల వెనుక అసలు రహస్యం?

covid1 3

 భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటు మాత్రం స్వల్ప స్థాయిలో ఉంది. కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వ్యక్తులు కూడా అధికంగా ఉండటంతో రికవరీ భారీగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి మరియు ఇతర ముఖ్యమంత్రులు దేశంలో రికవరీ రేటు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని ప్రకటించారు. అయితే తాజాగా వెలువడుతున్న అధ్యయన అంశాలు పాలకులు చెబుతున్న వాటికి విరుద్ధంగా ఉన్నాయి.

ప్రపంచంలో కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాలలో భారత్‌ 23వ స్థానంలో కొనసాగుతుండగా. భారత్‌లో నమోదవుతున్న కోవిడ్‌ కేసుల్లో మరణాల సంఖ్య 1.87 శాతం ఉంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం భారత్ లో  మరణాల రేటు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం “వయస్సు”. కరోన వైరస్ అధికంగా వృద్ధులు మరియు చిన్నారులపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో సగటున పది మందిలో ఆరుగురు యువకులు ఉండటం. ప్రపంచంలో అధిక యువశక్తి కలిగిన దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉండటంతో మనదేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ రిసర్చ్‌’ ఇటీవల విడుదల చేసిన అధ్యయన పత్రంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత్‌లో కరోనా బారిన పడిన 50 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్కుల్లో కోలుకున్న వారికంటే మరణించిన వారి సంఖ్యే ఎక్కువ. దేశంలో ఇప్పటి వరకు 33,87,501 కరోనా కేసులు నమోదు కాగా, 25,83,948 మంది కోలుకున్నారు. ప్రస్తుతం7,42,023 మందికి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ అదేస్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య ఉండటంతో పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad