Home రాజకీయాలు ఏపి వార్తలు అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణాన్ని డిజైన్ చేసింది ఈయ‌నే...

అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణాన్ని డిజైన్ చేసింది ఈయ‌నే…

ayodhya planner thumb

ప్ర‌స్తుతం చాలా మంది చ‌ర్చించుకుంటున్న అంశం అయోధ్య‌లోని రామ మందిర నిర్మాణ‌మే. ఇప్ప‌టికే రాములోరి ఆల‌య నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగింది. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదగా….. ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. అలాగే శ్రీరామ్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు…. రామమందిర నమూనా నిర్మాణాన్ని కూడా ఆవిష్క‌రించారు. ఇంత‌టి ప‌విత్రమైన ఆల‌య నిర్మాణానికి డిజైన్ చేసింది ఎవ‌రో చాలా మందికి తెలియ‌దు. అందుకే అత‌ని గురించి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. రామ మందిర నమూనాని రూపొందించిన వ్యక్తి పేరు చంద్రకాంత్ సోమ్ పుర. ఈయ‌న ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత కూడా.

చంద్ర‌కాంతే కాదు ఆయ‌న పూర్వీకులు కూడా ఆల‌య న‌మూనాలు ఇస్తుండేవారు. 1940లో చంద్రకాంత్ తాత…. సోమ్‌నాథ్‌ ఆలయ నమూనాను రూపొందించారు. అంతేకాకుండా అక్షర్‌థామ్‌ ఆకృతులను కూడా చంద్రకాంత్ కుటుంబం రూపొందించారు. నిజానికి మోడ్ర‌న్ ఆర్కిటెక్చర్ చదువుకోకపోయినా కానీ చంద్రకాంత్ కు…… భారతీయ నిర్మాణ శైలి పై చాలా అవగాహన ఉంది. ఇదిలా సాధ్య‌మ‌ని అడిగితే…..నిర్మాణ విద్యను తన తాత దగ్గర నుంచే నేర్చుకున్నాను అని చెప్తారు చంద్రకాంత్.


30 ఏళ్ల కిందటే రామమందిర నిర్మాణం నమూనా రూపొందించడానికి చంద్రకాంత్ ని సంప్రదించారట. అలా 1990లో మొదటిసారి రామమందిర నమూనా నిర్మాణాన్ని రూపొందించారట. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందు రూపొందించిన డిజైన్లో ఎన్నో మార్పులు చేర్పులు చేయాల్సి వ‌చ్చింది. ముందు రెండు గోపురాలతో డిజైన్ చేసిన ఆలయ నమూనా….. ఇప్పుడు 5 గోపురాలతో, శిఖరంతో రూపొందించారు.ఇక చంద్ర‌కాంత్ రూపొందించిన ఆల‌యాలు విష‌యానికొస్తే…. బనస్ కాంతలోని అంబాజీ ఆలయం, లండన్ లోని స్వామి నారాయణ ఆలయాన్ని కూడా ఈయ‌నే రూపొందించారు. అంతేకాదు…. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకుపైగా ఆలయ నమూనాలని త‌యారు చేశారు చంద్ర‌కాంత్‌. శిల్ప శాస్త్రం పై 12 పుస్తకాలను రచించారు చంద్ర‌కాంత్‌.

ప్రస్తుతం భారత దేశంలో నిర్మించబోతున్న మ‌రో ఎనిమిది ఆలయాల డిజైన్లను కూడా చంద్ర‌కాంతే రూపొందిస్తున్నారు. ఆయన ఇన్నేళ్ల కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ….చంద్రకాంత్ ని పద్మశ్రీతో సత్కరించింది. త‌న తాత గుజరాత్ లోని సోమ్ నాథ్ ఆల‌య డిజైన్ రూపొందించారని….. తాను ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి నమూనా డిజైన్ చేయడం చాలా సంతోషంగా ఉంద‌ని చెబుతున్నాడు. రాజస్తాన్ లోని బన్సీ పహర్ పూర్ నుండి తెప్పించిన పింక్ శాండ్ స్టోన్ తో ….రామ మందిరాన్ని నిర్మించబోతున్నారు. మందిర నిర్మాణం లో ఎలాంటి లోహాన్ని వాడ‌రు. ఆలయ నిర్మాణ పనులను చంద్రకాంత్ కుమారులు నిఖిల్, ఆశిష్, అశుతోష్ పర్యవేక్షిస్తున్నారు. ఆలయ నిర్మాణం అయిన తర్వాత ఫలితాన్ని ఆస్వాదించడానికి …..తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చంద్రకాంత్ వెల్ల‌డించారు. ప‌ర‌మపవిత్ర‌మైన శ్రీరాముని ఆల‌యం అందులోనూ ద‌శాబ్దాల నాటి క‌ల త్వ‌ర‌లోనే సాక్షాత్కారం కాబోతుండ‌డంతో…..ఆయ‌న ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad