Home రాజకీయాలు జాతీయ వార్తలు దమ్ముంటే నన్ను ఆపు: కంగనా వార్నింగ్

దమ్ముంటే నన్ను ఆపు: కంగనా వార్నింగ్

Kangana Ranaut 1 1

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు తర్వాత బాలీవుడ్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇండస్ట్రీ మొత్తం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం&నేపోటిజం భారీగా పెరిగిపోయాయని కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె “ముంబైను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ” వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెర తీశాయి. ఆమె వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం మరియు శివసేన తీవ్ర స్వరంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యం శివసేన నేత సంజయ్‌ రౌత్‌, కంగనా రనౌత్ పై విరుచుకుపడ్డారు. 

కంగనాకు ముంబై అంటే ఇష్టం లేకపోతే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అన్నారు. ముంబై ప్రజలు, పోలీసులపై నమ్మకం లేనప్పుడు ఇక్కడికి ఎందుకు రావాలి అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆమెను ఏకంగా ఓ మానసిక రోగితో పోల్చారు. కంగనా వ్యాఖ్యలపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సైతం అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కంగనారనౌత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అనిల్‌ దేశ్‌ముఖ్‌ ను తాలిబన్‌తో పోల్చడంతో పాటు తాను ఈ నెల 9న ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి. నన్ను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తా అంటూ సవాల్‌ విసిరింది. అయితే కంగనా చేస్తున్న వ్యాఖ్యల వెనుక రాజకీయ శక్తులు అండ ఉందని శివసేన బహిరంగంగానే విమర్శిస్తుంది.

మరో వైపు కంగనాకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. అయినప్పటికీ కంగనా రనౌత్ తగ్గడం లేదు. తను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ముంబై వేదికగా డ్రగ్స్ మరియు అక్రమ ఆయుధాల వ్యాపారం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించింది. తను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని ఆమె ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad