Home టాప్ స్టోరీస్ విజయశాంతి షాకింగ్ కామెంట్స్

విజయశాంతి షాకింగ్ కామెంట్స్

vijayashanthi jpg 1200x900

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు పై తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి స్పందించారు. వెండి తెరపై తమను తాము చూసుకోవాలని ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. అటువంటి టాలెంటెడ్ కళాకారులు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం అత్యంత బాధాకరమైన విషయమని విజయశాంతి అన్నారు. ఈ కేసును చేధించేందుకు పోలీసులు మరియు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించడం శుభ పరిణామం. టాలీవుడ్ లో కూడా ఒకప్పుడు ఇటువంటి అనేక ఘోరమైన సంఘటనలు జరిగాయని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది నటులు నటీమణులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కానీ వారిలో ఏ ఒక్కరికి కూడా న్యాయం చేకూరేలా దర్యాప్తు పూర్తి కాలేదు. ఎందరో నటీనటులు అనుమానాస్పదంగా మృతి చెందితే పోలీసులు కేసు నమోదు చేసి తూతూమంత్రంగా విచారణ జరిపి కేసును క్లోజ్ చేసే వారిని విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు.

అసలు నిజాలు బయటకు రాకుండా కొంతమంది వ్యక్తులు ప్రయత్నించే వారిని అన్నారు. ప్రస్తుతం సుశాంత్ కేసులు వస్తున్న నిజాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. సామాన్యులైన, సెలబ్రిటీ అయినా చట్టం ముందు అందరూ ఒకటే. అందుకే ఈ కేసును ఎటువంటి వివక్షకు దారి లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని విజయశాంతి అన్నారు. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి సీబీఐ విచారణ చేస్తుంది. తాజాగా విచారణకు హాజరైన రియా చక్రబొర్తికి రియాకు పట్టపగలే చుక్కలు కనిపించాయని తెలుస్తోంది. గత శుక్రవారం విచారణకు హాజరైన రియాను దాదాపు 11:30 గంటల ప్రశ్నించినట్టు సమాచారం.

విచారణ మొదట్లో రియా చెప్పదలచుకున్న అంశాలను మొత్తం చెప్పవలసిందిపాటుగా అధికారులు అడిగారు. రియాకు – సుశాంత్ ఎలా పరిచయమయ్యాడు? తర్వాత వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది? వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఎవరెవరు? అనే విషయాలపై సీబీఐ ప్రశ్నించింది. మొదట్లో రియా చెప్పిన వివరాలన్నిటినీ రికార్డ్ చేసుకున్న అధికారులు ఆ తర్వాత తమ సిద్ధం చేసుకున్న ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. ముఖ్యంగా సుశాంత్-రియా మధ్య ఆర్థిక లావాదేవీలు, మాదకద్రవ్యాలు వంటి అంశాలపై సీబీఐ ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బుధవారం నాడు రియా సోదరుడు షోవిక్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రియాను ప్రశ్నించారు. సుశాంత్ మరణానికి కొన్ని రోజుల ముందు రియా ఎందుకు ఫ్లాట్ ను విడిచిపెట్టి వెళ్లిందనే కోణంలో ప్రశ్నలు సంధించినట్టు పలు వార్తా పత్రికలు కథనాలు రాశాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad