Home రాజకీయాలు కీలక పదవి అందుకున్న విజయసాయి రెడ్డి

కీలక పదవి అందుకున్న విజయసాయి రెడ్డి

Vijaya Sai Reddy Elected As BAC Member

వైయస్సార్సీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తాజాగా ఓ కీలక పదవిని అందుకున్నారు. ఇప్పటికే రాజ్యసభ్య సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డికి బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ)లో చోటు లభించింది. రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా వైకాపా అవతరించడంతో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో ఆ పార్టీ తరఫున విజయసాయి రెడ్డికి చోటు దక్కింది. రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలకపాత్ర పోషిస్తుంది.ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా నుండి నలుగురు కొత్త ఎంపీలు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభ్యలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య రెండు నుండి ఆరుకు పెరిగింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు బీఏసీ సభ్యులుగా ప్రొఫెసర్‌ మనోజ్‌ కుమార్‌ ఝా, మల్లికార్జున్‌ ఖర్గే, శివ్‌ ప్రతాప్‌ శుక్లాలను నామినేట్ చేశారు.

అటు సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ సభ్యులుగా జీవీఎల్‌ నరసింహారావు, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు.విజయసాయి రెడ్డికి బీఏసీలో చోటు దక్కడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి విజయసాయి రెడ్డి చేస్తున్న సేవలే ఆయనకు ఈ పదవి దక్కేలా చేశాయని వారు అంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ సహా పలువురు నేతలు విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad