“YSR కాంగ్రెస్ పార్టీ” ఈ ఎన్నికల్లో సంచలనం సృస్టించ బోతుందా ? అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. అలా అని వైసీపి మేనియా కేవలం ఆంధ్ర రాష్ట్రనికి మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. దేశ రాజధాని “ఢిల్లీ” వరకు కూడా పాకిందట వైసీపి అధినేత “జగన్ మోహన్ రెడ్డి” మేనియా. ఇది నిజం అంటూ వీ.డీ.పీ సర్వే మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటివరకు విడుదలైన అనేక సర్వేలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో విడుదలైన “వీ.డీ.పీ సర్వే” కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో AP ప్రజల్లో మరింత నమ్మకం కలుగుతోంది.
వీ.డీ.పీ సంస్థ విడుదల చేసిన సర్వేలోని వాస్తవాలను ఒక్కసారి పరిశీలిస్తే.. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు సాధించి దేశంలోనే అతిపెద్ద మూడో పార్టీగా “వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” అవతరించబోతుందని ఈ సర్వే స్పష్టంగా చెప్పింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు “YS జగన్” స్థాపించిన YSRCP పార్టీ ఇప్పటికే 9 వసంతాలను పూర్తి చేసుకుంది.
అలాంటి వైసీపీ పార్టీ రెండోసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొబోతుంది. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ.. ఈసారి మాత్రం స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని వీ.డీ.పీ సర్వే స్పష్టం చేస్తుంది. మరీ ముఖ్యంగా APలోని 25 పార్లమెంట్ స్థానాల్లో ఏకంగా 20 స్థానాలను గెలుచుకొని… దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీల్లో వైసీపీ మూడో స్థానంలో నిలవడం పక్కా అని వీ.డీ.పీ సంచలన సర్వేను విడుదల చేసింది.