Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు నవంబర్‌ నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ:ట్రంప్ సంచలన నిర్ణయం

నవంబర్‌ నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ:ట్రంప్ సంచలన నిర్ణయం

coronavirus vaccine bottles

కరోనా వ్యాక్సిన్ ని నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాల గవర్నర్లకు ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం “ కరోనా వ్యాక్సిన్ అక్టోబర్ చివరి నాటికి లేదా నవంబర్ 1 లోగా సిద్దంకానుంది. రాష్ట్రాలు పంపిణీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని” సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ సూచించింది. సీడీఎస్‌ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ ఫీల్డ్‌ దీనికి సంబంధించిన లేఖను ఈనెల ఆగస్టు 27న వివిధ రాష్ట్రాలకు రాశారు. ఈ లేఖ ఆన్ లైన్ లో లీక్ కావడంతో వ్యాక్సిన్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మెక్‌కెసన్‌ కార్పొరేషన్‌ టీకా డోసుల్ని సరఫరా చేయనుందని తెలుస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే సీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండగా దానికి రెండు రోజులు ముందే వ్యాక్సిన్ పంపిణీకి ట్రంప్  ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఎలక్షన్లకు ముందు వ్యాక్సిన్ ని విడుదల చేయడం ద్వారా తమ ప్రభుత్వం కరోనా వైరస్ ని కట్టడి చేసింది అనే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ట్రంప్ ఈ విధానాన్ని అవలంభిస్తున్నారని జో బిడెన్ ఆరోపించారు. ప్రస్తుతం కరోనా కోసం అభివృద్ధి చెందుతున్న ఏ టీకా కూడా తుది దశకు చేరుకోలేదు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి.

అమెరికా విడుదల చేద్దామనుకున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటుంది. ఈ సమయంలో మానవ ప్రయోగాలు పూర్తికాకుండానే వ్యాక్సిన్ ని విడుదల చేయడం ద్వారా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రష్యా విడుదల చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో రష్యా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను ఈ వారం జరపనుంది. అమెరికా ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భారీ ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad