
రాఫెల్…రాఫెల్….గత 24 గంటలుగా దేశంలో దీనిగురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. రాఫెల్ రాకతో భారత వైపు కన్నెత్తి చూడాలంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలతో భారత వైమానిక దళంలో కొత్త శకానికి నాంది పలికినట్లయిందని…ఈ మల్టీ రోల్ విమానాలు ఐఏఎప్ సామర్ధ్యాలను విప్లవాత్మకంగా మారుస్తాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మొదటి విడత రాఫెల్ విమానాలను భారత్‌కి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన ఏడుగురు ఫైలట్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్లు లేకుండా రాపెల్ భారత్ గడ్డపై అడుగుపెట్టేది కాదనడంలో అతిశయోక్తి లేదు.
గ్రూప్ కెప్టెన్ హర్కీరత్ సింగ్….
ప్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలను తీసుకొచ్చిన ఫైలట్ల బృందానికి గోల్డెన్ ఆరో 17 స్క్వాడ్రన్ రాఫెల్ కామాండింగ్ ఆఫీసర్ హర్ కీరత్ నేత్రుత్వం వహించారు. హర్ కీరత్ సింగ్‌కు గతంలో అత్యంత ప్రతిష్టాత్మక శౌర్య చక్ర అవార్డు లభించింది. 2008లో ఓ మిషన్ సందర్భంగా హర్కీరత్ ఎంఐజీ 21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపారు. అయితే విమానం అనుకోకుండా ప్రమాదానికి గురైనప్పటికీ….అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అది కూలిపోకుండా ల్యాండ్ చేయగలిగాడు. దీంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడినవాడయ్యాడు. ఆ సమయంలో ఆయన స్కాడ్రన్ లీడర్ గా ఉ న్నారు. హర్ కీరత్ తండ్రి కూడా ఆర్మీలోనే లెఫ్టినెంట్ కల్నల్ గా సేవలందించి రిటైర్ అయ్యారు. హర్ కీరత్ భార్య కూడా ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ లో సర్వీంగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
వింగ్ కమాండర్ అభిషేక్ త్రిపాఠి
జనవరి 9, 1984లోజన్మించిన త్రిపాఠి స్కూల్ రోజుల్లో రెజ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజస్థాన్ లోని జలౌర్ అనే చిన్న పట్టణం నుంచి ఎదిగొచ్చాడు. ఆయన తండ్రి బ్యాంకు ఉద్యోగి కాగా తల్లి సేల్స్ ట్యాక్స్ డిపార్టమెంట్ లో పనిచేసేవారు. యువకుడిగా ఉన్నప్పుడు మంచి క్రీడాకారుడిగా కూడా త్రిపాఠి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ప్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలకు భారత్ తీసుకొచ్చిన ఫైలట్లలో త్రిపాఠి కూడా ఒకరు.
వింగ్ కమాండర్ మానీష్ సింగ్…
యూపీలోని బలియా జిల్లాలోని బక్వా అనే ఓ మారుమూల గ్రామం నుంచి మనీష్ సింగ్ ఎదిగొచ్చాడు. ఆయన కుటుంబంలో చాలా మంది ఆర్మీలో పనిచేశారు. అదే పరంపర కొనసాగిస్తూ మనీష్ సింగ్ కూడా సైనిక్ స్కూల్లో చదువుకుని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. 2003లో ఎయిర్ ఫోర్స్ లో చేరి సేవలందిస్తున్నారు. ప్రాన్స్ లో రాఫెల్ యుద్ధ విమానాల శిక్షణకు ఎంపిక చేసిన 12 మంది ఫైలట్లలో మనీస్ కూడా ఒకడు. రాఫెల్ యుద్ధ విమానాలను మనీష్ నడపడం గర్వంగా ఉందని ఆయన తల్లి తెలిపారు.
గ్రూప్ కెప్టెన్ రోహిత్ కటారియా…
ప్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కి తీసుకొచ్చిన ఫైలట్లలో రోహిత్ కటారియా ఒకరు. హర్యానాలోని బసాయ్ అనే చిన్న గ్రామం నుంచి రోహిత్ వచ్చారు. ఆయన తండ్రి కూడా ఆర్మీలో పనిచేసే కల్నల్ గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత రిటైర్ సైనిక్ స్కూల్‌కి ప్రిన్సిపాల్ అయ్యారు. రోహిత్ కటారియా రాఫెల్ యుద్ధ విమానం నడుపుతున్నాడని తెలిసి ఆయన స్వగ్రామంలోని యువకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. రోహిత్ తమకు రోల్ మోడల్ అని అభిప్రాయపడ్డారు. ఈ నలుగురే కాదు..రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు తీసుకొచ్చిన మరో ముగ్గురు ఫైలట్లపై కూడా దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.