Home రాజకీయాలు మ‌మ్మ‌ల్ని చాలా ఇబ్బంది పెట్టారు: టీవీ9 కొత్త యాజ‌మాన్యం

మ‌మ్మ‌ల్ని చాలా ఇబ్బంది పెట్టారు: టీవీ9 కొత్త యాజ‌మాన్యం

టీవీ9 సీఈవో, డైరెక్టర్ పదవి నుంచి రవిప్రకాష్‌ను తొలగించినట్లు సంస్థ కొత్త యాజ‌మాన్యం ‘అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్’ గ్రూప్ డైరెక్టర్లు అధికారికంగా ప్రకటించారు. తాము 90.5 శాతం షేర్‌ను అలందా మీడియా ఏబీసీఎల్‌లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. కానీ త‌మ‌కు బాధ్యతలు అప్పగించడానికి ఏబీసీఎల్ చాలా లేటు చేసిందని తప్పుపట్టారు.

తమకు కేంద్రం నుంచి కూడా అప్రూవల్ వచ్చిందని.. అయినా బోర్డు మీటింగ్ పెట్టమంటే రవిప్రకాష్ పెట్టలేదని డైరెక్టర్లలో ఒకరైన సాంబశివరావు ఆరోపించారు. రవిప్రకాష్ చాలా అవరోధాలు కల్పించారని విమర్శించారు. తప్పుడు ప‌నుల‌తో ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. అలందా బోర్డు లోని నలుగురు డైరెక్టర్లు రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు.

క న్నడ టీవీ9 హెడ్ మహేంద్ర మిశ్రాను ప్రస్తుతం టీవీ9 తెలుగు సీఈవోగా నియమించామ‌ని.. అలాగే సీవోవోగా సింగారావును పెట్టినట్లు తెలిపారు. ఇక ఎంప్లాయిస్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు. అవసరమైతే మరి కొంత మందిని తీసుకుంటామని వెల్లడించారు.

మా రూల్స్ ప్రకారం రవిప్రకాష్‌ను తొలగించామని. కానీ ఈ మధ్యలో అనవసరంగా రవిప్రకాష్ రాద్ధాంతం చేశారని విమ‌ర్శించారు. ఇకపై రవిప్రకాష్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని పరోక్షంగా సిబ్బందికి సూచించారు. సంస్థ‌తో ర‌విప్ర‌కాష్ కు ఎలాంటి సంబంధాలు ఉండ‌వ‌న్నారు. అత‌ను కేవ‌లం చిన్న వాటాదారుడు మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

Alanda media group takes over TV9 management - TV9

 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad