Home రాజకీయాలు తెలంగాణా వార్తలు కరోనా కాటుకు ఓట‌మి ఎరుగ‌ని మరో నేత మృతి..

కరోనా కాటుకు ఓట‌మి ఎరుగ‌ని మరో నేత మృతి..

nandi ellayya thumb

క‌రోనా ప్ర‌పంచాన్ని కబ‌లించేస్తోంది. రోజూ వేలాది మంది ప్రాణాలు తీస్తోంది. ల‌క్ష‌లాది కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. సామాన్యుడి నుంచి సెల‌బ్రెటీలు, రాజ‌కీయ‌నాయ‌కుల వ‌ర‌కు ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. కోవిడ్‌తో ఇటీవ‌ల ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల‌రావు చ‌నిపోగా….తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ పార్టీ నేత‌, మాజీ ఎంపీ నంది ఎల్ల‌య్య క‌న్నుమూశారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …..ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెల 29వ తేదీన కొవిడ్ లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. నంది ఎల్లయ్య వయసు 78 సంవత్సరాలు. ఓట‌మి ఎరుగుని అతి త‌క్కువ మంది నేత‌ల్లో నంది ఎల్ల‌య్య ఒక‌రు. కాంగ్రెస్ కురువృద్ధుడ‌నే చెప్పాలి.

ఒక‌సారి కాదు రెండు సార్లు కాదు..ఏకంగా ఆరు సార్లు లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. ఓటమి ఎరుగని నేతగా నంది ఎల్లయ్యకు గుర్తింపు ఉంది. సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 16వ లోక్ సభకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మందా జ‌గ‌న్నాథంను ఓడించి ఆరోసారి కూడా లోక్‌స‌భ‌కు వెళ్లారు. ఇక రెండు సార్లు రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. 2014 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు. అప్ప‌టి నుంచి క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

నంది ఎల్ల‌య్య 1942 జూలై 1న హైద‌రాబాద్‌లో జ‌న్మించారు. ఆయ‌న‌కు భార్య , న‌లుగురు పిల్ల‌లు. ఇద్ద‌రు కుమారులు, ఇద్ద‌రు కుమార్తెలు. పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నారు. నిగ‌ర్వి, మృధుస్వ‌భావి. ప్ర‌తీఒక్క‌ర్నీ ఆప్యాయంగా పిలుస్తుంటారు. బ‌ల‌హీనవ‌ర్గం నుంచి వ‌చ్చి తిరుగులేని నేత‌గా ఎదిగాడు నంది ఎల్ల‌య్య‌. నంది ఎల్ల‌య్య మృతితో తెలంగాణ కాంగ్రెస్ విషాదంలో మునిగిపోయింది. ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు…ఆయ‌న‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. పార్టీల‌క‌తీతంగా నంది ఎల్ల‌య్య‌కు నివాళులుర్పించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ త‌న‌దైన పాత్ర పోషించారు నంది ఎల్ల‌య్య‌. కాంగ్రెస్ హైక‌మాండ్‌కు ఎప్పుడూ ఎదురుచెప్ప‌ని నేత‌గా కూడా ఎల్ల‌య్య‌కు పేరుంది.అలాంటి నేత ఇక లేర‌నే విష‌యాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేక‌పోతున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad