Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు వ్యాక్సిన్ వచ్చేస్తోంది : ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యాక్సిన్ వచ్చేస్తోంది : ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

trump thumb

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు నిరంతరాయంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు . తాజాగా వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు నవంబరు 3 నాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతానికి మానవప్రయోగ దశలోనే ఉన్న ఈ రెండు అమెరికన్ వ్యాక్సిన్లు మరికొద్ది నెలల్లో వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ మూడు కాకుంటే దానికంటే ముందే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కుండ బద్దలు కొట్టారు .ఈ విషయాలను గెర్లాడో రైవేరా రేడియో కార్యక్రమం ద్వారా ప్రజలతో పంచుకున్నారు. అయితే తమ వ్యాక్సిన్ టెక్నాలజీని చైనా దొంగతనం చేస్తుంది అనే అంశంపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ట్రంప్ తెలిపిన నవంబరు 3 నాడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 3న వ్యాక్సిన్ విడుదలకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని అమెరికా మీడియా ఆరోపించింది . మరో వైపు ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి జో బిడెన్ వర్గం విమర్శలు గుప్పించింది. అమెరికాలో ఇప్పటికీ కరోనా బాధితుల సంఖ్య 50 లక్షలు ఉండగా మరణాల సంఖ్య, 1.67 లక్షలగా ఉంది. వచ్చే ఏడాదిలోగా వ్యాక్సిన్ ను విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల విభాగం చీఫ్ ఆంటోని ఫౌచీ వ్యాఖ్యానించారు. ఈ నెల 15న రష్యా తయారుచేస్తున్న వ్యాక్సిన్ విడుదల కానుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం భవిష్యత్తులో కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడీ విరుద్ధమైన వాదనలు ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad