Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

లెబ‌నాన్ రాజ‌ధానిలో పేలుడికి అస‌లు కార‌ణం ఇదే..

lebonan thumb

ఇటీవ‌ల లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ లో జ‌రిగిన పేలుడు ప్ర‌పంచాదేశాల‌ను వ‌ణికించింది. భారీ పేలుడు వంద‌కుపైగా జ‌నాన్ని చంపేసింది. వేలాది మందిని గాయాలు పాలు చేసింది. మ‌రెంతో మందిని నిరాశ్రాయుల‌ను చేసింది. పేలుడు త‌ర్వాత అక్క‌డ నెల‌కొన్న భ‌యాన‌క దృశ్యాల‌ను చూస్తే….ఎవ‌రికైనా వెన్నులో వ‌ణుకు పుడుతుంది. తెగిని కాళ్లు , చేతులు..ప‌గిలిన ముఖం…ఒంటి నిండా గాయాలు..ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో వ‌ర్ణించ‌లేని దృశ్యాలు కంట‌ప‌డ్డాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇంత‌కీ అక్క‌డ పేలుడుకు కార‌ణ‌మేంటి….మొద‌ట తీవ్ర‌వాద కుట్రేమోన‌ని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ కాద‌ని కొద్దిగంట‌ల్లోనే తేలిపోయింది. అది పాల‌కులు, నిర్వాహాకుల పాప‌మ‌ని తేలింది. అంత ప్రాణ ఆస్తి న‌ష్టానికి కార‌ణం అమ్మోనియ‌మ్ నైట్రేట్ అనే పేలుడు ప‌దార్ధం. అది పేల‌డం వ‌ల్లే ఇంత‌టి భారీ ప్ర‌మాదం జ‌రిగింది. పేలింది ఒక కిలోనో రెండు కిలోలో కాదు…రెండు వేల ట‌న్నుల‌కుపైగా పేలింది.

2014లో ర‌ష్యాకు చెందిన ఒక షిప్‌ను లెబ‌నాన్ అధికారులు ప‌‌ట్టుకున్నారు. అందులో 2,730 ట‌న్నుల అమ్మోనియ‌మ్ నైట్రేట్ ఉంద‌ని గుర్తించారు. పేలుడు ప‌దార్ధాలు, పురుగుల మందుల త‌యారీలో వాడుతుంటారు. ఇది త‌మ‌దీ అని ఎవ‌రూ రాక‌పోవ‌డంతో దాన్ని అలానే ఉంచారు. అప్ప‌టి నుంచి ఇన్నేళ్ల వ‌రకు దాన్ని ఎటు పంపించ‌లేక‌పోయారు. బీరుట్ లోని పోర్టు వేర్ హౌస్ లో ఉంచారు. కోర్టులో విచార‌ణ ద్వారా ఆ కేసును…. గెలిచి ఆ అమ్మోనియ‌మ్ నైట్రేట్‌ను ఎలాగొలాగ ఉప‌యోగించుకోవ‌చ్చు. దానిని లెబ‌నీస్ ఆర్మీకి అయినా లేదంటే ఏదైనా పేలుడు ప‌దార్ధాల కంపెనీకైనా ఇవ్వొచ్చు. కానీ ఆ రెండు జ‌ర‌గలేదు. అలానే దాన్ని ఐదున్న‌రేళ్లు పేర‌బెట్టారు. కాని దానికి స‌మీపంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం…లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌కు పెనుముప్పుగా మారుతుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. ఆ అగ్నిప్రమాద కీల‌లు…పేలుడు ప‌దార్ధమైన అమ్మోనియ‌మ్ నైట్రేట్ ను తాక‌డంతో భారీ పేలుడు సంభ‌వించింది. అంతేకాదు…ఒక్క నిమిషంలోనే ప్ర‌శాంతంగా ఉన్న న‌గ‌రం…ర‌క్త‌మ‌యం అయ్యింది. వంద‌ల మంది చ‌నిపోయారు.

వేలాది మంది గాయ‌ప‌డ్డారు. వంద‌లాది ఇల్లు నాశ‌న‌మైపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే మార‌ణ‌హోమంగా త‌యారైంది. దీంతో బీర‌ట్‌లో ప్ర‌జా ఆగ్ర‌హం పెల్లుబుకింది. పాల‌కులు, న్యాయ‌వ్య‌వ‌స్థ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఇంత‌టి దారుణం జ‌రిగింద‌ని ఆరోపించారు. స‌ద‌రు పాల‌కుల‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలు తీసే మీరా పాల‌కులు అని నిల‌దీస్తున్నారు. ఇక మ‌రోవైపు పేలుడుతో అత‌లాకుత‌ల‌మైన బీర‌ట్ న‌గ‌రాన్ని ఆదుకునేందుకు ప్ర‌పంచ దేశాలు ముందుకొచ్చాయి. ఎవ‌రికివారు తమ‌కు తోచ‌ని సాయాన్ని చేస్తున్నారు. బీర‌ట్ న‌గ‌రం మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం పొందాలంటే క‌చ్చితంగా ఒక ఏడాది కాల‌మైనా ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad