Home రాజకీయాలు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు గుడి

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు గుడి

Yes Jagan Temple

దేవుళ్ల‌కు గుడి క‌ట్ట‌డం సాధార‌ణ‌మైన విష‌యం. అందుకోసం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతుంటారు. దేవుడిపై భ‌క్తి, విశ్వాసంతో కొంద‌రు అప‌ర భ‌క్తులు ….వాళ్లే సొంత ఖ‌ర్చుల‌తో క‌ట్టేస్తుంటారు. ఇక సినీతార‌ల‌కు కూడా కొన్ని చోట్ల ఆల‌యాలు నిర్మిత‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఖుష్బు, న‌మిత లాంటి తార‌ల‌కు ఆల‌యాలు కూడా క‌ట్టారు. మ‌రికొంద‌రు నేతల‌కు కూడా కొన్ని చోట్ల ఆల‌యాలు నిర్మించారు. దివంగత వైఎస్ఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో వేలాది విగ్ర‌హాలు వెల‌శాయి. కానీ ఆల‌యాలైతే క‌ట్ట‌లేదు. అయితే నేత‌ల‌కు గుళ్లు నిర్మిత‌మౌతున్న జాబితాలో… ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా చేర‌నున్నారు. ఇందుకు పశ్చిమ‌గోదావ‌రి జిల్లా వేదికైంది. గోపాలపురం మండలం రాజుపాలెంలో వైసీపీ నేతలు….. సీఎం జగన్ కు గుడి నిర్మిస్తున్నారు. ఈ గుడిలో సీఎం జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయాన్ని స్థానిక వైసీపీ నేత కురుకూరి నాగేశ్వరరావు కుటుంబం నిర్మిస్తోంది. గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు…. ఈ ఆల‌యానికి శంకుస్థాపన చేశారు. ఒక పెద్ద ఇల్లుకు ఎంత ఖ‌ర్చు అవుతోంది..ఆ స్థాయిలో గుడి క‌ట్టాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నారు.

20 ల‌క్ష‌ల‌పైనే ఉండ‌వ‌చ్చ‌ని ఒక అంచ‌నా. వైఎస్ జ‌గ‌న్ విగ్ర‌హాం ఇందులో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంది. ఎంతో అద్భుతంగా, వైభ‌వంగా విగ్ర‌హాన్ని త‌యారు చేయ‌నున్నారు. వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడూ చిరున‌వ్వుతో క‌న్పిస్తుంటారు. సేమ్ అదే పోజ్‌ను విగ్ర‌హరూపంలో చెక్క‌నున్నారు. అలా ఆల‌యానికొచ్చిన ప్ర‌తీఒక్క‌రికీ…. వైఎస్ జ‌గ‌న్ విగ్ర‌హం చిరున‌వ్వుతో క‌నిపించ‌బోతుంది. అయితే ఆలయానికి భ‌క్తులు మాత్రం క‌చ్చితంగా వైఎస్ ఆర్, వైఎస్ జ‌గ‌న్ అభిమానులు, వైసీపీ కార్య‌క‌ర్త‌లే. వీరిద్ద‌రి పాల‌న‌లో ల‌బ్ది పొందిన ప్ర‌తీఒక్క‌రూ ఈ గుడికి వ‌చ్చి ద‌ర్శించుకునే అవ‌కాశం అయితే క‌న్పిస్తుంది.

వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న పాల‌న చూసే గుడి నిర్మాణాన్ని చేస్తున్నామ‌ని చెబుతున్నారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా పాల‌న అందిస్తున్నార‌ని….అలా చేస్తున్న వ్య‌క్తికి అభిమానంతో గుడి క‌ట్టించుకోవ‌డం త‌ప్పేమీ కాద‌ని చెప్పుకొస్తున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో గుడి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆరంభిస్తామ‌ని అంటున్నారు. అయితే ఈ విష‌యం ఆ నోటా ఈ నోటా ప‌డి వైఎస్ జ‌గ‌న్‌కు చేరింది. దీనిపై చిన్న చిరున‌వ్వు న‌వ్వి వెళ్లిపోయారు. కొంద‌రు మాత్రం దీన్ని పూర్తిగా త‌ప్పుబడుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం స‌మ‌ర్ధిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad