Home రాజకీయాలు తెలంగాణా వార్తలు తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్

తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్

HIGHCOURTHYDERABAD

తెలంగాణ హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై విచారించిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఏ ఒక్క ఆదేశాలను కూడా అమలు చేయలేదని సీరియస్ అయింది. కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్ హాస్పిటల్ విచ్చలవిడిగా దోచుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సీఎస్  సోమేశ్ కుమార్..కరోనాకు సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన అన్ని ఆదేశాలను అమలు పరచమని ప్రస్తుతం టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచామని కోర్టుకు తెలిపారు.

టెస్ట్ విషయంలో సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలపై మాత్రం సీరియస్ అయ్యింది. ఇప్పటికి 50 ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసు ఇచ్చామని సీఎస్ ధర్మానికి తెలియజేశారు. అయినప్పటికీ కోర్టు ఆగ్రహం చల్లారలేదు ఇతర హాస్పిటల్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అపోలో, బసవతారకం వంటి హాస్పిటల్స్ పై ఇంక చర్యలు తీసుకోలేదని గుర్తు చేసింది. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బులెటిన్ విడుదల చేస్తామని సీఎస్ కోర్టుకు తెలిపారు.

గతంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం తాము తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి మాత్రమే ఆ విమర్శలు చేశామని, ప్రభుత్వాన్ని విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని న్యాయస్థానం తెలిపింది. తమ వ్యాఖ్యలను కరోనా యోధులు అపార్థం చేసుకోవద్దని సూచించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కోసం మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశామని అధికారులు నైతిక స్థైర్యం దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది . 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad