Home టాప్ స్టోరీస్ తెరుచుకున్న బడులు...కేవలం ఉపాధ్యాయులు మాత్రమే

తెరుచుకున్న బడులు…కేవలం ఉపాధ్యాయులు మాత్రమే

unnamed file 2

కరోనా వ్యాప్తి కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించడంతో మార్చి నెల నుండి ప్రభుత్వ పాఠశాల మూతపడ్డాయి. తాజాగా కేంద్రం ఆదేశాలతో 158 రోజుల తర్వాత ప్రభుత్వ పాఠశాల తెరుచుకున్నాయి. అయితే కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే అనుమతి ఉండటంతో విద్యార్థులు ఇంకా పాఠశాలకు హాజరు కాలేదు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ క్లాసులు ప్రారంభం కానుండటంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ లెర్నింగ్ మెటీరియల్ మరియు పాఠ్యాంశ ప్రణాళికలు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు తలమునకలై ఉన్నారు.

కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన టీచింగ్‌ క్యాలెండర్ విడుదల కాకపోవడంతో..కేవలం రానున్న మూడు నెలలకు సంబంధించి సిలబస్ కు మాత్రమే పాఠ్యాంశ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రవాణా విషయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులు దూర ప్రాంతాల నుండి పాఠశాలకి వస్తుండటం, ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇదే అదునుగా ప్రైవేటు వాహనాలు రేట్లను భారీగా పెంచి ఉపాధ్యాయుల జోబులకు చిల్లులు పెడుతున్నాయి. సెప్టెంబర్ నుండి ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా జరగనున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో  పాఠశాలలు తెరుచుకుని అవకాశం ఉంది. కాగా తెలంగాణలో సెప్టెంబర్ ఫస్ట్ నుండి ఆన్లైన్ డిజిటల్ క్లాసులు మొదలు కానున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad