Home రాజకీయాలు తెలంగాణా వార్తలు 6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

Telangana Government Approves To Build 6 Airports In State

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటినుండో ఓ అంశంపై రాజకీయ నేతలతో పాటు ప్రజల్లోనూ బలమైన కోరిక వినిపిస్తూ వస్తోంది. ఇతర దేశాలకు, ప్రాంతాలకు వాయుమార్గం ద్వారా వెళ్లేందుకు కేవలం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఒకటే దిక్కుగా ఉంది. కాగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని ముఖ్యమైన 6 ప్రాంతాల్లో ఈ ఎయిర్ పోర్టుల ఏర్పాట్లకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా వరంగల్, ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, బసంత్ నగర్, దేవరకద్ర మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అనుమతి పత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు గల అడ్డంకుల వివరాలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆరా తీసింది.

అయితే ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గతంలో స్థలం విషయంలో అడ్డంకులు నెలకొన్నాయి. అయితే ఆ అంశాలకు సంబంధించిన వివరాలతో పాటు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గల అనుకూల, ప్రతికూల పరిస్థితులను తెలపాలంటూ AAI తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం ఆయా వివరాలను కూడా అందించిందని, త్వరలోనే ఈ 6 ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు జరగనుందని అధికార వర్గాలు అంటున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad