Home టాప్ స్టోరీస్ ఆన్‌లైన్‌ పాఠాలు..పిల్లల కష్టాలు

ఆన్‌లైన్‌ పాఠాలు..పిల్లల కష్టాలు

1600x960 128964 online classes

కరోనా ఉధృతి పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలును మూసివేసింది. అయితే ఇప్పటికీ కరోనా విజృంభణ తగ్గిపోవటం మరోవైపు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తవడంతో తెలంగాణ సర్కిల్ ఆన్‌లైన్ పాఠాలు బోధించడానికి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టీ శాట్‌ యాప్‌ మరియు డీడీ యాదగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఇప్పటికే ఉపాధ్యాయులు తరగతులకు హాజరు అయ్యారు. ఆన్‌లైన్ పాఠాలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొనసాగనున్నాయి. కానీ ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది.

దాదాపు నూటికి 80 శాతం మంది పిల్లలకు ఆన్‌లైన్ బోధన అర్థం కావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన కష్టంగా మారిందని సమాచారం. పాఠాలు టీవీలో ప్రసారం అయినప్పటికీ విద్యార్థులు వినే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు దిగువ మధ్యతరగతి పేద కుటుంబానికి చెందిన విద్యార్థులే అధికం. అందులోను వారి తల్లిదండ్రులు వ్యవసాయం మరియు కూలీ పై ఆధారపడి పనిచేసే వారు కావడంతో ఇంట్లో టీవీ మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఉండే అవకాశం తక్కువ. దీంతో మెజారిటీ విద్యార్థులకు పాఠాలు అందక నానా అవస్థలు పడుతున్నారు.

కొన్ని కుటుంబాల్లో ఫోన్ ఉన్నప్పటికీ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం మరో సమస్యగా మారింది. అన్నింటికి మించి గంటలకొద్దీ టీవీ , మొబైల్ ఫోన్ ముందు కూర్చోడం విద్యార్థులకు కష్టతరమవుతుంది. దీని వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇది వరకే హైకోర్టు అభిప్రాయపడింది. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఏడాది విద్యా సంవత్సరం చిన్నాభిన్నం అయ్యిందన్నది వాస్తవం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad