Home టాప్ స్టోరీస్ శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

Nagarkurnool1

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం ఎడమగట్టు కాలువలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ యంత్రాలు నుండి భారీ శబ్దంతో మంటలు ఏర్పడినట్టు ఉద్యోగులు తెలిపారు. హఠాత్తుగా మంటలు ఏర్పడి దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఈ సమయంలో 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా ఇప్పటికే 15 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో 9 మంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత భారీగా స్థాయిలో ఉండటంతో మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించారు.

మొదటి విద్యుత్ తయారీ యూనిట్లు అగ్ని ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో 10 మంది సురక్షితంగా బయటకు రాగా మరో 9 మంది చిక్కుకున్నారని మంత్రి వెల్లడించారు. వారు మాట్లాడుతూ ‘‘లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఫైర్‌, పోలీస్‌ సిబ్బంది లోపలికి వెళ్లారు. దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోపలికి వెళ్లి వెనక్కి వచ్చారు. ఆక్సిజన్‌ పెట్టుకుని వెళ్లినా లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి సిబ్బంది సహాయం కోరాం. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని’’ మంత్రి వెల్లడించారు.

అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో “విజనల్ ఇంజినీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్లు, వెంకట్రావ్, ఫాతిమా, మోహన్, సుష్మా, కుమార్, సుందర్, కిరణ్, రాంబాబుగా ప్రమాదంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad