Home టాప్ స్టోరీస్ భాగ్యనగరంలో బరితెగింపు.. బట్టబయలు చేసిన ఖాకీలు!

భాగ్యనగరంలో బరితెగింపు.. బట్టబయలు చేసిన ఖాకీలు!

Prostitution In Hyderabad Bursted By Police

హైదరాబాద్‌లో ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న నేరాలను పోలీసులు బట్టబయలు చేస్తున్నారు. అయినా కూడా నేరగాళ్లు ఏమాత్రం భయపడకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల భారీ మొత్తంలో మత్తు పధార్థాలను పట్టుకున్న పోలీసులు, తాజాగా ఓ ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టును బట్టబయలు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ పాడుపనిని వారు చేధించి నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని కీసర ప్రాంతానికి చెందని వంశీరెడ్డి అనే వ్యక్తి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వ్యభిచార నిర్వాహకురాలైన అంజలితో చేతులు కలిపాడు. ఈ దందాలో త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో కోల్‌కతాకు చెందిన పలువురు అమ్మాయిలను ఉద్యోగం పేరిట హైదరాబాద్‌కు తీసుకొచ్చి, ఇక్కడ వారితో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో అమ్మాయిల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షించడం, వారి గురించిన సమాచారం తెలుసుకున్నాకే వారి వద్దకు అమ్మాయిలను పంపించేవాడు. అయితే దీనికి సంబంధించిన లావాదేవీలు మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగేవి.

కాగా ఈ విషయంపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వీరి స్థావరంపై దాడి చేశారు. వ్యభిచార నిర్వాహకుల చెర నుండి నలుగురు అమ్మాయిలను పోలీసులు విడిపించారు. కాగా వంశీరెడ్డి, అంజలిని అరెస్ట్ చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. అయితే అమ్మాయిల అక్రమ తరలింపు కింద వారిద్దరిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad