Home రాజకీయాలు తెలంగాణా వార్తలు పంద్రాగస్టు నాడు ఖైదీల విడుదల లేనట్లేనా?

పంద్రాగస్టు నాడు ఖైదీల విడుదల లేనట్లేనా?

kcr

కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు 15న ఖైదీల విడుదల సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వాస్తవానికి విడుదలకు రెండు నెలలు ముందుగానే ఖైదీల జాబితాను సిద్ధం చేయవలసి ఉండగా ఇప్పుడు ఈ జాబితా ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. దీనికి న్యాయపరమైన అనేక చిక్కులు ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే, ఈ జాబితా రూపకల్పనలో అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఆధారంగా జాబితా రూపొందిస్తున్నారు. ఈ జాబితాలో తీవ్రమైన నేరాలు ( చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆడవారిపై అత్యాచారాలకు, సంఘ విద్రోహ శక్తులు ) చేసిన వారికీ అనుమతి లేదు. ఇప్పటికే తుది జాబితా పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిగా ఈ నెల చివరన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను  జారీ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా 2016లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా 2020 ఆగస్టున మరికొందరు విడుదల కానున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ జాబితాలో 399 మంది ఖైదీల ఉన్నట్టు తెలుస్తోంది.       

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad