Home టాప్ స్టోరీస్ గ్యాస్ సిలిండర్ పంపిణీలో కొత్త విధానం

గ్యాస్ సిలిండర్ పంపిణీలో కొత్త విధానం

cylinder 3

వంట గ్యాస్‌ అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వినియోగదారులకు సిలిండర్ అందడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డెలివరీ సమయంలో కొంతమంది వ్యక్తులు వీటిని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తు ఉండటంతో కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. మరో వైపు గ్యాస్ బుక్ చేసినప్పటికి సిలిండర్ డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించేందుకు, వినియోగదారులకు సక్రమంగా సిలిండర్లు అందించేందుకు ఆయిల్‌ కంపెనీలు చర్యలు చేపట్టాయి.

ఇకనుండి వినియోగదారులకు డిజిటల్ వెరిఫికేషన్ తర్వాతనే గ్యాస్ సిలిండర్లు అందించాలని కంపెనీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కంపెనీలు కొత్త వెరిఫికేషన్ విధానానికి శ్రీకారం చుట్టాయి. ఇక నుండి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత వినియోగదారుడి మొబైల్ కి ఓటీపీ రానుంది. ఈ  ఓటీపీని  సదరు డెలివరీ బాయ్ కి చూపిస్తేనే సిలిండర్‌ డెలివరీకానుంది. వినియోగదారుడు చెప్పిన ఓటీపీ డెలివరీ బాయ్‌ వద్ద ఉన్న మొబైల్ లో ఎంటర్ చేస్తాడు. ఆ ఓటీపీ ధ్రువీకరణ అయిన వెంటనే మీకు మరో మెసేజ్ వస్తుంది. తద్వారా బుక్‌ చేసుకున్న కస్టమర్‌కే సిలిండర్‌ అందుతుంది. ఈ విధానం వలన గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు వెళ్లే అవకాశం తక్కువ. దీంతోపాటు వినియోగదారులకు సిలిండర్ అందిందా లేదన్నది సదరు ఏజెన్సీలకు తెలుస్తోంది.

హైదరాబాద్ మరియు మరికొన్ని జంటనగరాల్లో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానం ప్రారంభం కాగా  మరికొన్ని నెలల్లో పూర్తిగా అమల్లోకి రానుంది. ఒకసారి ఈ విధానం అమల్లోకి వస్తే వినియోగదారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయిల్ కంపెనీలు సూచిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో డోర్‌ డెలివరీ బాయ్‌కి నగదును నేరుగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే వెసులుబాటును కూడా గ్యాస్‌ సరఫరా సంస్థలు కల్పించాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad