Home రాజకీయాలు జాతీయ వార్తలు ప్రారంభంకానున్న మెట్రో సేవలు.. ఎప్పటి నుండో తెలుసా ?

ప్రారంభంకానున్న మెట్రో సేవలు.. ఎప్పటి నుండో తెలుసా ?

delhi metro 3

ఆగస్టు 31 తో కేంద్రం విధించిన లాక్ డౌన్ 3.0 ముగియనుండడంతో ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0 ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 1 నుండి మెట్రో రైళ్ళు పున:ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే వైరస్ తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాలు మెట్రో రైళ్ల సేవల పై తుది నిర్ణయాన్ని తీసుకొనున్నాయి. అన్‌లాక్‌ 4.0 కు సంభదించిన మార్గదర్శకాలు ఈ వారంలో వెలువడనున్నాయి. ఈ ఏడాది మార్చి ఆఖర్లో నిలిచిపోయిన మెట్రో సేవలు  మరోసారి ప్రారంభం కావడానికి సర్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

మెట్రో సేవలు మొదలవుతున్నప్పటికీ పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు ప్రస్తుతానికి అనుమతినిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఐఐటీలు, ఐఐఎంల వంటి అగ్రగామి విద్యా సంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అన్‌లాక్‌ 4.0 భాగంగా  బార్లు కూడా తెరుచుకోనున్నాయి. అయితే మద్యాన్ని బార్లో కూర్చుని తాగే అవకాశం ఉండదు. ఇక సెప్టెంబర్లో సినిమా ధియేటర్లు గెలుచుకునే అవకాశం దాదాపు లేనట్లే. థియేటర్ యాజమాన్యం భౌతిక దూరం పాటిస్తూ సినిమా హాలును నడపడం ఆర్థిక భారంతో కూడుకున్నది అందుకే థియేటర్లను తెరిచే అవకాశం లేదని పలు పత్రికలు కథనాలను  ప్రచురితం చేశాయి. మూవీ థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్ , పార్కులు, ఆడిటోరియం వంటివి ఇప్పట్లో తెలుసుకునే అవకాశం దాదాపు లేనట్టే.

వాస్తవానికి లాక్ డౌన్  నిబంధనలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండటంతో సరుకు రవాణా సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఈసారి కేంద్ర ఏకీకృత లాక్ డౌన్ ను తీసుకువచ్చే అవకాశం ఉంది. హైదరాబాదు లాంటి నగరాల్లో మెట్రో సేవలు ప్రారంభం అయినప్పటికీ టోకెన్ల కు బదులుగా మెట్రో కార్డులు మరియు రైలు ఆగే సమయాన్ని పెంచే అవకాశం ఉంది. ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కంటెంట్ జోన్లలో మాత్రం ఈ సడలింపులు ఉండవని తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad