Home రాజకీయాలు తెలంగాణా వార్తలు పాలు అమ్ముతున్న హరీష్ రావు ఫ్యామిలీ

పాలు అమ్ముతున్న హరీష్ రావు ఫ్యామిలీ

Harish Rao Family Enters Dairy Business

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఆయన ప్రజాసేవ చేస్తూ కనిపిస్తుంటారు. ఇక ఎలాంటి వివాదాలకు హరీష్ రావు, ఆయన కుటుంబ సభ్యులు తావివ్వరు. కాగా హరీష్ రావు కుటుంబ సభ్యుల గురించి ప్రజలకు చాలా తక్కువ తెలుసు. అయితే తాజాగా హరీష్ రావు సతీమణి శ్రీనిత పాల వ్యాపారంలో అడుగుపెడుతున్నారు.

హరీష్ రావు సతీమణి శ్రీనిత మిల్చి మిల్క్‌ పేరుతో పాల ఉత్పత్తులను ఆమె తాజాగా ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించాలని, తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆమె తెలిపారు. స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, లేకపోతే అనారోగ్యం పాలవుతామని ఆమె అన్నారు. ఇక మిల్చి మిల్క్‌ను చిల్లింగ్‌ కేంద్రాలు, బల్క్‌ కూలర్లు, ప్యాకింగ్‌ స్టేషన్ల ద్వారా సరఫరా మార్గాలపై కఠినమైన నియంత్రణతో వినియోగదారుల ఇంటి వద్దకే అందిస్తామని ఆమె తెలిపారు.

ఇలా హరీష్ రావు సతీమణి పాల వ్యాపారంలో అడుగుపెట్టడంతో ఆయన సన్నిహితులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక హరీష్ రావు నియోజకవర్గ ప్రజలు తమ నాయకుడి కుటుంబం కొత్త వ్యాపారం చేయడం తమకు సంతోషం కలిగించిందని అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad