Home రాజకీయాలు తెలంగాణా వార్తలు సొంతగూటికి చేరనున్న జేజమ్మ..?

సొంతగూటికి చేరనున్న జేజమ్మ..?

DK Aruna To Join Congress

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ పేరు తెలియని వారు ఉండరు. ఫైర్‌బ్రాండ్, జేజమ్మ అని అక్కడి ప్రజలు ఆమెను పిలుస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డీకే అరుణ అంటే ఓ బ్రాండ్ ఉండేది. ఆమె మాటల తూటాలకు ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఈ కారణంగానే ఆమెకు వైయస్ఆర్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఇదంతా ఒకప్పుటి మాట. 2019 ఎన్నికల తరువాత ఆమె హస్తం గుర్తుకు చేయిచ్చి బీజేపీలో చేరింది.

అయితే అది ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదు. బీజేపీలో అప్పటికే సీనియర్ నాయకులు ఉండటం, బీజేపీలో యువతకు పెద్దపీట వేయడంతో డీకే అరుణ ఆ పార్టీలో నామమాత్రంగా మిగిలిపోయారు. దీంతో ఇప్పుడు ఆమె మరోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ భవిష్యత్ లీడర్ రేవంత్ రెడ్డి ఆమెను తిరిగి కాంగ్రెస్‌లో జాయిన్ కావాలంటూ కోరుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన లీడర్ కావడంతో పాటు, ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే గద్వాల్ డివిజన్‌లో మళ్లీ కాంగ్రెస్ హవా కొనసాగుతుందని ఆయన భావిస్తున్నాడట.

అటు డీకే అరుణ కుటుంబ సభ్యులు, గద్వాల్ డివిజన్‌లోని అరుణ అభిమానులు, ఆమె కార్యకర్తలు కూడా ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లాలని సూచిస్తుండటంతో ఆమె ఆలోచనలో పడిందట. త్వరలోనే డీకే అరుణ కాంగ్రెస్ గూటిలో చేరుతుందనే వాదన గద్వాల్‌తో పాటు కాంగ్రెస్ వర్గాల్లోనూ జోరుగా వినిపిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad