Home టాప్ స్టోరీస్ పెళ్లిలో లొల్లి.. 44 మందికి కరోనా!

పెళ్లిలో లొల్లి.. 44 మందికి కరోనా!

44 Corona Cases Confirmed In A Marriage In Jagtial

ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు సమూహంగా ఒకచోట కలిసే పరిస్థితులు లేకుండా పోయాయి. అయితే కరోనా విజృంభనకు ఎక్కువ అవకాశాలు ఉండే ప్రతి అంశాలను ప్రభుత్వాలు నిషేధిస్తూ వచ్చింది. కాగా పెళ్లిల్లు, వేడుకలు, సమావేశాలు లాంటివి నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పెళ్లి వేడుకలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కానీ తాజాగా తెలంగాణలోని జగిత్యాలలో ఓ వివాహ వేడుకలో కరోనా కలకలం రేపడంతో అందరూ షాక్ అవుతున్నారు. మల్యాల మండలం లంబాడిపల్లెలో ఒక వివాహ వేడుకలో పాల్గొన్న 44 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ నెల 13న జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి 104 మంది హాజరయ్యారు. వారిలో 44 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ పెళ్లికి వచ్చినవారు వణికిపోతున్నారు. సదరు వివాహ వేడుకకు హాజరైనవారు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో ఇలాంటి వేడుకలను అన్ని జాగ్రత్తల నడుమ నిర్వహించుకోవాలని, ఎక్కువ మంది రాకుండా చూసుకోవాలని, అప్పుడే కరోనాను కట్టడి చేయగలమని అధికారలు సూచిస్తున్నారు. ఏదేమైనా కరోనా దెబ్బకు పార్టీలు, పెళ్లిల్లకు వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. మరి ఈ కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు కనిపెడతారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad