Home టాప్ స్టోరీస్ మాధవీలతకు షాక్ ఇచ్చిన పోలీసులు

మాధవీలతకు షాక్ ఇచ్చిన పోలీసులు

thumb 1

గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం భారీ స్థాయిలో ఉందని హీరోయిన్ మాధవీలత చేసిన కామెంట్లపై తెలంగాణ ఎక్సైజ్ పోలీస్ శాఖ సీరియస్ అయింది. ఆరోపణలు చేసే ముందు దానికి ఖచ్చితమైన ఆధారాలను చూపించవలసిందిగా కోరారు. మత్తుపదార్థ వినియోగంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో పాటు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఒకవేళ ఈ మధ్యకాలంలో మాధవిలతకు డ్రగ్స్ వాడకం గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు చెప్పవలసిందిగా పోలీసులు కోరారు. సుశాంత్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో దేశం మొత్తం షాక్ అయింది. 

ఈ సమయంలో మాధవిలత డ్రగ్స్ వాడకం గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల కిందట తన పార్టీకి ఎటెండ్ అయ్యానని, ఆ సమయంలో పలువురు డ్రగ్స్ తీసుకోవడం తను కళ్లారా చూశానని మాధవీలత పలు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయింది. ఐదేళ్ల కిందట డ్రగ్స్ వాడకం గురించి తమకు తెలిసినప్పుడు అప్పుడే చెప్పవలసిందని, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు పోలీసులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. టాలీవుడ్ లో పదేళ్ళ కిందట డ్రగ్స్ రాకెట్ బయటపడినప్పుడు పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మాధవిలత ఆరోపణలు గుప్పించారు.

ఈ కేసును విచారిస్తున్న పలువురు కీలక అధికారులను ట్రాన్సఫర్ చేశారంటూ ఆరోపణలు చేశారు. పోలీస్ శాఖకు ఆరోపణలు కంటే సాక్ష్యాలే అతి ముఖ్యమైనవి వాటి ఆధారంగానే పోలీసులు పనిచేస్తారని పోలీస్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. మాధవిలత వ్యాఖ్యలపై పోలీసులు అంత సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కొంతమంది వ్యక్తులు పోలీస్ శాఖ పై కావాలని బురద జల్లుతున్నారని పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad