Home రాజకీయాలు ఏపి వార్తలు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్

TDP Mla Atchannaidu Tested Corona Positive

కరోనా వైరస్ రోజురోజుకూ తన ప్రభావాన్ని మరింతి పెంచుకుంటూ వెళ్తోంది. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పడుతున్నారు. ఇప్పటికే దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. కాగా తాజాగా ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడు బుధవారం నాటి నుండి అనారోగ్యానికి గురయ్యారు.

ఈ క్రమంలో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించగా గురువారం పాజిటివ్ అని తేలింది. దీంతో స్థానికి రమేష్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్టుకు ఆసుపత్రి వర్గాలు లేఖ రాయనున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం హైకోర్టుకు లేఖ రాయనుంది. అయితే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అయితే గతంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో గోల్‌మాల్ జరిగిందనే కారణంగా ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా నిధులు నిర్వహించారు. కాగా ఆయన త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఆయన సన్నిహితులు కోరుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad