టీడీపీ కీలక నేతలు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు అందింది. కాగా ఈ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ తరహా ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
తప్పుచేసింది రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యులా..? ఉన్నతాధికారుల కొడుకులా..? అన్నది చూడకుండా కఠిన చర్యలు ఉంటాయని, అధికారులు కూడా తాను ఫుల్ పర్మీషన్స్ ఇస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఇదిలా ఉండగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ ఘటనలకు సంబంధించి బుద్దా వెంకన్న, బొండా ఉమలపై విచారణ చేయాలంటూ వేలకొద్ది ఫిర్యాదులు అందాయని, అయినా ప్రభుత్వం వారిదే కావడంతో చర్యలు తీసుకోలేదని బోరగడ్డ అనీల్ అన్నారు. ఇప్పటికైనా వారిపై ఫిర్యాదు చేయాలని బోరగడ్డ అనీల్ సీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు.