విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే “తలసాని శ్రీనివాస్ యాదవ్” టీ కాంగ్రెస్ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “మీరు బాదపడకండి తెలంగాణలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు” అంటూ టీ కాంగ్రెస్ నేతలకు సలహా ఇచ్చాడు తలసాని. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో మాట్లాడినా ఆయన.. కాంగ్రెస్ పార్టీ నేతలు దద్దమ్మల్లా మారారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని అన్నారు. కాంగ్రెస్ నేతలకు పార్టీని నడపడం చేతకాక తమపై ఏడుస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
ఈ సందర్భంగా BJPపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. మతాన్ని నమ్ముకుని, అమ్ముకుని ఓట్లు అడిగే పార్టీ BJP అని, దేశానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని విమర్శించాడు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 16 MP సీట్లను TRS గెలిస్తే, కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన నిధులను తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.