Home రాజకీయాలు జగన్‌, బాబు, కేసీఆర్‌ల‌పై స్వరూపానంద సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

జగన్‌, బాబు, కేసీఆర్‌ల‌పై స్వరూపానంద సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

జ‌గ‌న్ నా ప్రాణం.. కేసీఆర్ మ‌హామేధావి.. ఇరువురూ త‌న‌కు ప్రాణసమానులేనంటూ విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ సీఎం కావాలని శారదా పీఠం ఐదేళ్లు తపస్సు చేసిందని చెప్పారు. కృష్ణాతీరంలో శారదాపీఠ ఉత్తరాధికారి నియామక కార్యక్రమంలో స్వ‌రూపానంద ఈ వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌ మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి. మహాభారతం చదివిన ఏకైక ముఖ్యమంత్రి ఆయనే అన్నారు.

త‌న‌ హృదయంలో ఒక ఆత్మగా తాను ప్రేమిస్తున్న వ్యక్తి జగన్‌ మోహన్‌రెడ్డి. ఈ మాట నేను అగ్నిసాక్షిగా చెబుతున్నాను. ఆయనంటే నాకు పరమ ప్రాణం. విశాఖ శ్రీ శారదాపీఠం ఆయన కోసం ఐదేళ్లు అహర్నిశలూ కష్టపడింది. ఆయనంటే ప్రాణం పెట్టింది. అక్కడ గోడలు, పక్షులు, చెట్లు, పుట్టలు, వ్యక్తులు.. ఎవర్ని అడిగినా జగన్‌ గెలవాలి అన్న మాటే వినిపించేది అని చెప్పుకొచ్చారు.

అందరు దేవతలు జ‌గ‌న్‌ను పరిపూర్ణంగా ఆశీర్వదించాలని, ఆంధ్ర ప్రజలకు ఆయన ఎంతో మేలు చేయాలని… విశాఖ శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఉత్తరాధికారి కూడా ఆయనకు అండగా ఉంటార‌న్నారు. అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందనడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నిదర్శనమ‌న్నారు.

శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మను నియమిస్తున్నట్టు నాలుగేళ్ల క్రితం గంగా తీరంలో తనను కలసినప్పుడు జగన్‌కు చెప్పానని, ఆయన చాలా సంతోషించారని తెలిపారు. 2024 నాటికి పూర్తిగా పీఠాధిపతి బాధ్యతలు స్వాత్మానందేంద్రకు అప్పగించి తాను తపస్సే ధ్యేయంగా జీవితం గడుపుతానన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad