Home రాజకీయాలు జాతీయ వార్తలు సుప్రీం సంచలన తీర్పు:1 రూపాయి జరిమానా

సుప్రీం సంచలన తీర్పు:1 రూపాయి జరిమానా

NKV PrashantBhushan 1024x768 1

కోర్టు ధిక్కారణ కేసులో ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. మొదటి క్షమాపణ చెప్పవలసిందిగా కోర్టు కోరగా అందుకు నిరాకరించడంతో ఒక రూపాయి జరిమానా విధిస్తున్నట్లు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారీతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 15లోగా జరిమానా చెల్లించికపోయినట్లయితే మూడు నెలల జైలు శిక్షతోపాటు మూడు సంవత్సరాలు న్యాయవాద వృత్తికి నుంచి సస్పెన్షన్ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తీర్పు ఇచ్చే సమయంలో జస్టిస్ మిత్ర మాట్లాడుతూ… న్యాయవ్యవస్థపై ప్రశాంత్ భూషణ్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ అది ఇతరుల హక్కులను కాలరాసేల ఉండకూడదని అన్నారు.

2020 జూన్ 27, 29 తేదీల్లో ప్రశాంత్ భూషణ్‌ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిల చేసిన ట్వీట్లు తీవ్ర దుమారాన్ని తెర తీశాయి. ఆనాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వ్యతిరేకంగా భూషణ్‌ ట్వీట్‌లు చేశారు. ట్వీట్లు అత్యున్నత న్యాయస్థానం విలువను దిగజార్చడం, నలుగురు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల పోలి ఉండటంతో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు కోర్టు తేల్చింది. 

భూషణ్‌ వివాదాస్పద ట్వీట్లు :

మొదట ట్వీట్ ను 27 న చేశారు. దానికి ప్రకారం “భవిష్యత్తులో చరిత్రకారులు గత ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా నాశనమైందో  చూడవచ్చు. ఈ విధ్వంసంలో సుప్రీంకోర్టు పాత్ర మరియు ముఖ్యంగా చివరి నలుగురు సీజేఐల పాత్రను కూడా చూడొచ్చు అని వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆ తరువాత రెండు రోజులకి జూన్ 29 న సిజెఐ బొబ్డే ఫోటోను చేర్చి మరో ట్వీట్ చేశారు “ సిజెఐ నాగ్‌పూర్‌లో బిజెపి నాయకుడికి చెందిన 50 లక్షల మోటారు సైకిల్‌ను హెల్మెట్, మాస్క్ లేకుండా నడుపుతున్నారు. లాక్ డౌన్ సమయంలో సామాన్యులకు సుప్రీం కోర్టులో న్యాయం పొందే ప్రాథమిక హక్కును నిరాకరించి, బీజేపీ నాయకుడి మోటార్ వాహనం నడుపుతున్నారు” అని ట్వీట్ చేశారు.ఇది కాస్తా వివాదంగా మారింది.

దీని పై స్పందించిన సిజెఐ కార్యాలయం ఆ ఫోటో కోసం వివరణ ఇచ్చింది. సిజెఐ పదవీ విరమణ  తరువాత హార్లే డేవిడ్సన్  బైక్ కొనాలనుకున్నారని. దానికి సంబంధించిన శాంపిల్ బైక్ ను డీలర్ పంపడంతో సిజెఐ వాహనం నడపకుండా దానిని పరిశీలించారని, ఆ బైక్ ఎవరిదో తమకు తెలియదని ప్రకటించింది. ప్రశాంత్ భూషణ్ఈ చేసిన ఈ రెండూ ట్వీట్లు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ ట్వీట్లు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ప్రశాంత్‌ భూషణ్‌ దోషిగా తేల్చింది. నేడు ఈ కేసు పై సుప్రీంకోర్టు అంతిమ తీర్పును వెలువరించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad